చిరూకి మెగా రెమ్యునరేషన్
on Jun 20, 2014
ఈ మధ్య సినిమా విశేషాలన్నింటిలో ఎక్కువ ఆసక్తి కలిగిస్తున్న అంశం స్టార్ రెమ్యూనరేషన్లు. చుక్కలను తాకుతున్న ఈ రెమ్యునరేషన్ల గురించి ప్రతి ఒక్కరికీ ఆసక్తే. పవన్ కళ్యాణ్ కి 50 కోట్ల ఆఫర్ వచ్చిందని ఆ మధ్య మీడియాలో కథనాలు అనేకం వచ్చాయి. పెద్దగా అవకాశాలు లేకపోయినా త్రిష ఒక సినిమా కోసం రెమ్యునరేషన్ బాగా డిమాండ్ చేసిందని టాలీవుడ్‌లో ఇంట్రస్టింగ్ టాకు జరిగింది. ఇలా రెమ్యునరేషన్ విషయం ఎప్పుడైనా హాట్ టాపిక్ గానే మెదులుతోంది సినీ ఇండస్ట్రీలో.
అలాంటిది మెగా స్టార్ 150వ సినిమా రెమ్యునరేషన్ గురించి చర్చ రాకుండా ఎలా వుంటుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి ఇంకా నిర్మాతలెవరో డిసైడ్ కాలేదు. కానీ ఈ చిత్రానికి చిరంజీవి తీసుకునే మొత్తం 30 కోట్ల వరకు ఉంటుందని మాత్రం అంటున్నారు. ఇది టాలీవుడ్ టాప్ హీరోలు పవన్, మహేష్ ల రెమ్యునరేషన్ కంటే ఎక్కువ.
రాజకీయాలలో వైఫల్యం తర్వాత మళ్లీ సినీమాల్లోకి వస్తున్న చిరంజీవి 150వ సినిమా పై ఇప్పుడు ఎక్కువ దృష్టి సారించారనే విషయం తెలిసిందే.