కొరియోగ్రాఫర్‌గా ఎన్టీఆర్ కొత్త ట్రెండ్
on Jun 20, 2014
రభస చిత్రానికి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు ఫిలింనగర్‌లో తెగ ప్రచారంలో వుంది. విషయం అనటం కన్నా విశేషం అనడం సరైందేమో. రభస చిత్రం కోసం ఎన్టీఆర్ కొత్త అవతారం ఎత్తాడని టాకు. అది చిత్రంలో కొత్త క్యారెక్టర్ గురించి కాదు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొరియోగ్రాఫర్‌గా మారబోతున్నాడు. డాన్స్ అంటే ఎక్కువ మక్కువ చూపించే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. అయితే అందుకోసం ఏకంగా డాన్స్ కొరియోగ్రఫి చెయ్యాలా అంటే, దానికి కారణాలు వేరే వున్నాయి అనే అంటున్నాయి సినీ వర్గాలు.
రభస చిత్రం ఫస్ట్‌లుకలో చాలా డిఫరెంట్ గా కనిపించిన ఎన్టీఆర్, ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేస్తు మరింత డిఫరెంట్ అని అనిపించుకుంటున్నాడు. ఎన్టీఆర్ స్వయంగా కొరియోగ్రఫీ చేసుకున్న డాన్సు స్టెప్పులు అదిరిపోతున్నాయని కూడా టాకు వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ ఈ కొత్త స్టెప్ తీసుకోవడానికి కారణమేమిటో ఇంకా తెలియాల్సివుంది. చెప్పాలంటే కొరియోగ్రాఫర్ గా మారిన టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ మాత్రమే అని, ఇదొక కొత్త ట్రెండ్ అని కూడా అంటున్నారు మరికొందరు.