అంతా సమంతమయం
on Jun 23, 2014
తెలుగు, తమిళ చిత్రాలలో సమంత హవా నడుస్తోందని చెప్పాలి. తెలుగులో ఈ నెల 27న ఆటోసూర్య, వచ్చే నెల 24న ‘అల్లుడు శీను’, వరుసగా సమంత చిత్రాలు విడుదలకు సిద్దంగా వున్నాయి. తమిళంలో సూర్యతో కలిసి నటించిన అంజాన్ చిత్రం ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా వుంది. అలాగే తెలుగులో ఎన్టీఆర్ సమంత కలిసి నటిస్తున్న రభస చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇలా వరుసగా సమంత నటించిన 4 చిత్రాలు విడుదలకు రెడీగా వున్నాయి.
సమంత ఇలా సినీ అవకాశాలు దక్కించుకోవాడానికి కారణాలు అనేకం. ఆమె హీరోయిన్‌గా నటించిన దాదాపు అన్ని చిత్రాలు బాక్సాఫీసు దగ్గర మంచి విజయాలు సాధించాయి. దీనితో ఈ హీరోయిన్ లక్కీ గర్ల్ ఇమేజ్ సంపాదించుకుంది. లేటెస్టుగా మనం సినిమా విజయం కూడా తోడవటంతో మరింత ఊపుమీద వుంది సమంత.
త్రిష, శ్రియ హీరోయిన్‌లు టైమ్ అవుట్ కావటం, తమన్న, కాజల్ హిందీ చిత్ర పరిశ్రమ బాట పట్టటం, ఇవన్నీ సమంతకు కలిసి వచ్చాయని చెప్పోచ్చు. తెలుగు, తమిళ భాషలలో నటిస్తున్న సమంత తన సినిమాలకు క్రేజ్ తెచ్చుకునేందుకు కావలసినంత ఎక్స్‌పోజింగ్ ఎప్పటికప్పుడు జోడిస్తు వచ్చింది. తన చిత్రాలకు యూత్ క్రేజ్ ఎలా తెచ్చుకోవాలో మొదటి సినిమా నుంచే సమంతకు తెలుసనిపిస్తుంది. మంచి టైమింగ్‌తో కెరీర్‌లో సరైన స్టెప్స్ వేస్తోంది సమంత. అలాగే చిత్రాలకు క్రేజ్ తెచ్చుకుంటూ, రెమ్యునరేషన్ రేటు ఎలా పెంచుకోవాలో హీరోయిన్లు సమంతను చూసి నేర్చుకోవల్సిందే...