Home

»

Featured News

డబ్బు అనే మాయాజాలం మనుషుల మధ్య మమకారాలను ఎలా తుంచేస్తుందంటే..?

Mar 03, 2026

డబ్బు ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళే.. మరి అది లేనప్పుడు? మన అనుకున్న వాళ్లే పరాయి వాళ్ళయిపోతారు. జీవితంలో ఆస్తిపాస్తులు, అంతస్తులు ఉన్నప్పుడు మన చుట్టూ వందల మంది ఉంటారు. కానీ, కాలం కలిసి రాక ఆ డబ్బే దూరమైతే? మన రక్త సంబంధీకులు, మనం ప్రాణంగా ప్రేమించే మన బిడ్డలే మనల్ని ‘అపరిచితుల్లా’ చూస్తారు. అలాంటి ప‌రిస్థితి వ‌స్తే.. ఆ తండ్రి బాధ వ‌ర్ణ‌నాతీతం.  మహానటుడు ఎస్.వి. రంగారావు తన గంభీరమైన స్వరంతో, కళ్ళకు కట్టినట్టు వివరించిన ఈ సత్యం ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తుంది. అపారమైన ఆస్తి నుంచి అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన ఒక తండ్రి వేదన, ఆ సమయంలో తన పిల్లల ప్రవర్తనను చూసి ఆవేదన పడే ఈ సన్నివేశం ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. ఎస్.వి.రంగారావు, అంజలీదేవి, కష్ణ, శోభన్‌బాబు, వాణిశ్రీ, నాగయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా పేరు ‘లక్క్ష్మీ నివాసం’. 

ఒకప్పుడు లక్షాధికారిగా ఉన్న సుబ్బయ్య.. తన బిడ్డలను కోటీశ్వరులను చేయాలనే తపనతో వ్యాపారం చేసి అనుకోకుండా 16 లక్షల అప్పుల్లో మునిగిపోతారు. ఆస్తి కేవలం 6 లక్షలు మాత్రమే మిగులుతుంది. ఆ సమయంలో తన బిడ్డలు అండగా ఉంటారని ఆశించిన ఆ తండ్రికి నిరాశే ఎదుర‌వుతుంది. తండ్రి పరిస్థితిని చూసి కన్న కొడుకే ఈసడించుకోవడం సమాజంలోని కఠిన వాస్తవానికి అద్దం పడుతుంది. తండ్రి కష్టకాలంలో ఉన్నప్పుడు పిల్లలు తమ పేరు మీద ఉన్న కొద్దిపాటి పొదుపు మొత్తాన్ని కూడా తండ్రి వ్యాపారం కోసం ఇవ్వడానికి నిరాకరిస్తారు. ‘మా డబ్బు మాకు ఇచ్చేస్తే మా బతుకు మేం బతుకుతాం’ అని వారు చెప్పే మాటలు వింటే, వారు కొడుకులు కాదు, ‘రాక్షసులు’ అనిపించక మానదు. 

‘తండ్రి ప్రాణం ఇచ్చినవాడే కానీ, డబ్బు లేకపోతే ఆ ప్రాణం కాస్తా పోతుంది’ అనేంతగా నేటితరం ధన వ్యామోహంలో మునిగిపోయింది. భార్య కూడా తన దారి తాను చూసుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఆ తండ్రికి మిగిలింది కేవలం శూన్యం. కన్నబిడ్డలే కాదనుకున్న వేళ, ఇన్నాళ్లూ సుబ్బ‌య్య‌ ఉప్పు తిన్న పనివాడు గంగయ్య చూపిన విశ్వాసం మనల్ని కదిలిస్తుంది. ‘కాయకష్టం చేసైనా మిమ్మల్ని పోషించుకుంటాను బాబు, కలో గంజో అంతా కలిసి తాగుదాం’ అని గంగయ్య అన్నప్పుడు, రక్తం పంచుకు పుట్టిన బిడ్డల కంటే పరాయివారే మిన్న అనిపిస్తుంది.

డబ్బు మాయాజాలం మనుషుల మధ్య మమకారాలను ఎలా తుంచేస్తుందో ఈ సన్నివేశం మనకు నేర్పిస్తుంది. ఆస్తి ఉన్నప్పుడు గర్వపడే బిడ్డలు, అది లేనప్పుడు తండ్రిని అవమానించడం అత్యంత దురదృష్టకరం. జీవితంలో మనం సంపాదించాల్సింది కేవలం డబ్బు మాత్రమే కాదు, కష్టకాలంలో వెన్నంటి ఉండే నమ్మకమైన వ్యక్తులను కూడా అనే సందేశం ఈ చిత్రంలో ఉంది. ఎంతో ఆసక్తిని, ఆలోచనను రేకెత్తించే సన్నివేశాలతో కూడిన వీడియోను క్రింద ఇస్తున్నాం. వీక్షించండి. అలాగే ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోల కోసం మా Teluguone Cinema ఛానల్‌ను Subscribe చేసుకోండి. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com