Home

»

Featured News

‘శివ’ పరమ బోర్ సినిమా.. పావుగంట కూడా చూడలేకపోయాను

Apr 07, 2026

(ఏప్రిల్ 7 రామ్‌గోపాల్‌వర్మ పుట్టినరోజు సందర్భంగా..)

తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ‘శివ’ ఎలాంటి చరిత్ర సష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా దశను, దిశను మార్చిన ఈ సినిమా ఎంతో మంది దర్శకులకు ఇన్‌స్పిరేషన్. తెలుగు సినిమాకి ఒక కొత్త అర్థం చెప్పిన ‘శివ’ చిత్రం విడుదలై 36 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇటీవలి కాలంలో రీరిలీజ్‌ల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే. సూపర్‌హిట్ అయిన సినిమాలు రీరిలీజ్‌లోనూ మంచి కలెక్షన్లు సాధించాయి. ఈ క్రమంలోనే ‘శివ’ చిత్రాన్ని కూడా గత ఏడాది నవంబర్ 14న రిలీజ్ చేశారు. 

నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని ‘శివ’ చిత్రాన్ని 4కె ఫార్మాట్‌లో డాల్బీ అటమాస్ సౌండ్‌తో ‘శివ’ కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేశారు. ఒకప్ప్పుడు థియేటర్లలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం రీరిలీజ్‌లోనూ మంచి కలెక్షన్స్ సాధించింది. ఇదిలా ఉంటే.. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇటీవల తన మొదటి సినిమా ‘శివ’ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. 

‘శివ నిర్మాణంలో ఉన్నప్ప్పుడు సినిమాపై ఒక్కరికి కూడా నమ్మకం లేదు. యూనిట్‌లోని వారే సినిమా ఏవరేజ్ అవుతుంది అన్నారు. నా విషయానికి వస్తే ఒక మంచి సినిమా అవుతుందని అనుకున్నాను తప్ప బ్లాక్‌బస్టర్ అవుతుందని ఊహించలేదు. శివ చిత్రంలోని సీన్స్ అన్నీ నా కాలేజ్ టైమ్‌లో చూసిన ఘటనల ఆధారంగానే క్రియేట్ చేశాను. హాలీవుడ్ మూవీ గాడ్ ఫాదర్, సన్ని డియోల్ హీరోగా వచ్చిన అర్జున్.. ఇంకా కొన్ని సినిమాల ఇన్‌స్పిరేషన్‌తో కొన్ని సీన్స్ చేశాను.

శివ తర్వాత సర్కార్, కంపెనీ, సత్య వంటి మాఫియా సినిమాలు చేశాను. ఈ సినిమాల ముందు నాకు శివ అనే సినిమా ఏమాత్రం శాటిస్‌ఫ్యాక్షన్ ఇవ్వలేదు. శివ రిలీజ్ అయిన తర్వాత చాలా సంవత్సరాలు ఆ సినిమా చూడలేదు. ఆమధ్య ఈ సినిమా 25 సంవత్సరాల ఫంక్షన్ జరిగింది. ఆ సమయంలో సినిమా చూసినపుడు నాకు చాలా బోర్ కొట్టింది. 15 నిమిషాలు కూడా సినిమా చూడలేకపోయాను. ఎందుకంటే శివ చేసే టైమ్‌కి నా మెంటల్ కండిషన్ వేరు, ఇప్ప్పుడు నా ఆలోచనలు వేరు. అందుకే సినిమాను చాలా బోర్‌గా ఫీల్ అయ్యాను. అయితే నేను చేసిన సినిమాల్లో సత్య నాకు ఇష్టమైన సినిమా. ఇందులోని సీన్స్ అన్నీ ఎంతో రియలిస్టిక్‌గా ఉంటాయి. అందుకే ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించదు’ అంటూ వివరించారు రామ్‌గోపాల్‌వర్మ. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com