Home

»

Featured News

లెజండరీ డైరెక్టర్ రిజెక్ట్ చేసిన ఈ ముగ్గురూ.. స్టార్స్ అయిపోయారు. ఎవరో తెలుసా?

Mar 18, 2026

చిత్ర పరిశ్రమలో నటీనటులుగా గానీ, టెక్నీషియన్స్‌గా గానీ సక్సెస్ అవ్వాలంటే డెఫినెట్‌గా టాలెంట్ అనేది అవసరం. ఎంతో మంది సినీ ప్రముఖులు చెప్పినట్టు టాలెంట్‌తోపాటు ఆవగింజంత అదష్టం కూడా కావాలి. టాలెంట్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో రాణించలేకపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే టైమ్‌ని ఆర్టిస్టులు బాగా నమ్ముతారు. తమకు కూడా టైమ్ వస్తే చక్రం తిప్పేస్తాం అంటుంటారు. కొందరి విషయంలో అది నిజమే అనిపిస్తుంది. ఇండస్ట్రీలోని వివిధ శాఖల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న చాలా మంది.. మొదట్లో రిజెక్ట్ అయినవారే. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి సూపర్‌స్టార్ అయ్యారు. అలాగే మధుర గాయకుడు ఘంటసాలకు తొలి రోజుల్లో ఎదురైన అవమానాలు తక్కువేమీ కాదు. ఇప్పటికీ ఆయన పాటల్ని అందరూ ఆస్వాదిస్తున్నారంటే ఆ గానంలోని మాధుర్యమే కారణం. సినిమా ప్రయత్నాల్లో భాగంగా రిజెక్ట్ అయిన సందర్భాలు సినిమా కళాకారులకు చాలా ఉంటాయి. పాతతరంలో లెజండరీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆదుర్తి సుబ్బారావు రిజెక్ట్ చేసిన ముగ్గురు నటీనటులు ఆ తర్వాత స్టార్స్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ ముగ్గురూ ఎవరు, వారిలోని టాలెంట్‌ని ఆదుర్తి ఎందుకు గుర్తించలేకపోయారు అనే విషయాల గురించి తెలుసుకుందాం.

1948లో కల్పన అనే హిందీ చిత్రం ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆదుర్తి సుబ్బారావు.. 1954లో వచ్చిన అమర సందేశం చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయమయ్యారు. రెండో సినిమా తోడికోడళ్లుతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత మాంగల్యబలం, వెలుగు నీడలు, ఇద్దరు మిత్రులు, మంచి మనసులు, చదువుకున్న అమ్మాయిలు, మూగ మనసులు, దాగుడు మూతలు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి.. ఇలా ఎన్నో అపురూపమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. అలా ఓ 20 సినిమాలు డైరెక్ట్ చేసిన తర్వాత స్టార్స్‌తో కాకుండా కొత్తవారితో ‘తేనె మనసులు’ చిత్రం చెయ్యాలనుకున్నారు. హీరో నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకూ అందరూ కొత్తవారు కావాలంటూ పేపర్ ప్రకటన ఇచ్చారు ఆదుర్తి. ఊహించిన దానికంటే ఎక్కువ మంది తమ వివరాలను తెలియజేస్తూ ఫోటోలు పంపించారు. వారిలో కొందరిని సెలెక్ట్ చేసి ఆడిషన్‌కి పిలిచారు. 

‘తేనె మనసులు’ సినిమాలో రామ్మోహన్‌ను హీరోగా ముందుగానే సెలెక్ట్ చేసుకున్నారు. మరో హీరో, ఇద్దరు హీరోయిన్లు, మిగతా నటీనటుల కోసం ఆడిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఆడిషన్‌కి హాజరైన వారిలో కష్ణ, కష్ణంరాజు, జయలలిత, హేమమాలిని కూడా ఉన్నారు. అయితే వారిలో కష్ణను మాత్రమే ఎంపిక చేశారు ఆదుర్తి. హీరోయిన్లుగా సంధ్యారాణి, సుకన్య సెలెక్ట్ అయ్యారు. కష్ణంరాజు, జయలలిత, హేమమాలినిలను రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ముగ్గురూ స్టార్స్‌గా ఎలా ఎదిగారో అందరికీ తెలుసు. హీరోగా పరిచయమై కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా నటించి, ఆ తర్వాత హీరోగా ఎన్నో సూపర్‌హిట్ సినిమాలు చేశారు కష్ణంరాజు. తన నటనతో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకొని రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. 

1961లో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన జయలలిత.. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో బాలనటిగా కనిపించారు. ఒక వయసుకు వచ్చిన తర్వాత డాన్సర్‌గా కొన్ని సినిమాలు చేశారు. తేనె మనసులు విడుదలైన సంవత్సరమే మనుషులు మమతలు చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయమయ్యారు జయలలిత. ఆ తర్వాత తమిళ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. వివిధ భాషల్లో హీరోయిన్‌గా తన సత్తా ఏమిటో చూపించి అందరు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయారు జయలలిత. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 

ఇక హేమమాలిని విషయానికి వస్తే.. తమిళ్‌లో ఇదు సాతియం, తెలుగులో పాండవ వనవాసం చిత్రాల్లో డాన్సర్‌గా నటించారు. తేనె మనసులు ఆడిషన్ తర్వాత చాలా కాలం వరకు ఆమెకు సినిమా అవకాశాలు రాలేదు. 1968లో వచ్చిన సప్‌నోంకా సౌదాగర్ చిత్రంలో తొలిసారి రాజ్‌కపూర్ సరసన హీరోయిన్‌గా నటించారు. ఆ తర్వాత ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు హేమమాలిని. హీరోయిన్‌గా ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. అలా దేశవ్యాప్తంగా ‘డ్రీమ్ గర్ల్‌’ అని పిలిపించుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు రిజెక్ట్ చేసిన కష్ణంరాజు, జయలలిత, హేమమాలిని.. ఈ ముగ్గురి కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగడం స్టార్ స్టేటస్ తెచ్చుకోవడం నిజంగా గొప్ప విశేషమనే చెప్పాలి. ఎంతో మంది గొప్ప నటీనటులతో సినిమాలు రూపొందించిన ఆదుర్తి సుబ్బారావు.. ఈ ముగ్గురిలోని టాలెంట్‌ని గుర్తించలేకపోవడం ఆరోజుల్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com