Home

»

Bollywood News

Tiger Shroff: టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిపింది వీళ్ళే: ఇద్దరు మహిళలు, ఒక మైనర్ బాలిక!

Oct 21, 2026 11:35AM


అభిమానులని, ఇండియన్ చిత్ర పరిశ్రమని ఉలిక్కిపాటుకి గురి చేస్తు అగ్ర హీరో 
టైగర్ ష్రాఫ్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో టైగర్ తృటిలో ప్రాణాప్రాయలనుంచి తప్పించుకొని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ఈ సంచలన కేసులో ముంబై పోలీసులు కీలక పురోగతి సాధించారు. 

ఈ కేసులో మొత్తం నలుగురిని అరెస్ట్ చేసారు. పట్టుబడిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. వీరికి ఒక మైనర్ బాలిక సహాయం చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్న అనిల్ పండిట్ అనే హ్యాండ్లర్ డైరెక్షన్‌లో ఈ ఆయుధాల అక్రమ రవాణా రాకెట్ నడిచినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ ఆయుధ సరఫరా కుట్రకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్యానాలోని సోనిపట్‌కు చెందిన 21 ఏళ్ల కునాల్, 19 ఏళ్ల సుమిత్ అలాగే ఉత్తరప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల రాధ, 23 ఏళ్ల బబితలను పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆదేశాల మేరకు అనిల్ పండిట్ అనే వ్యక్తి సూచనలతో కునాల్ పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి ఒక పిస్టల్, 20 తూటాలను సేకరించాడు. నిందితుడు కునాల్‌కు రాధతో పరిచయం ఉండటంతో, ఆమెను ఈ కుట్రలో వాడుకున్నాడు. అక్టోబర్ 15న రాధ, బబితలను ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లిన కునాల్.. రాధ బ్యాగ్‌లోనే పిస్టల్‌ను రహస్యంగా అమర్చాడు. ప్రయాణ అంతటా ఎన్‌క్రిప్టెడ్ యాప్ ద్వారా మహిళలతో టచ్‌లో ఉంటూ అనిల్ పండిట్ ఆదేశాలని వారికి చేరవేశాడు.

ఈ ఇద్దరు మహిళలు అక్టోబర్ 17న ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఒక హోటల్‌లో బస చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 18న ఉదయం సుమారు 11 గంటల సమయంలో హోటల్ సమీపంలో ఒక మైనర్ బాలుడు రాధను కలిసి ఆ బ్యాగ్‌ను తీసుకున్నాడు. అదే రోజు సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో టైగర్ ష్రాఫ్ కారు లక్ష్యంగా దుండగులు కాల్పులకు తెగబడ్డారు. 


ఇది కూడా చదవండి: రజినీ యావదాస్తి ఇక వాళ్ళకే! కుటుంబసభ్యులకి చెందదు! 

 

ఇదిలా ఉండగా, ఆయుధాలు చేరవేసిన రాధ, బబిత లు అక్టోబర్ 18న దాదర్-హరిద్వార్ ఎక్స్‌ప్రెస్‌లో ముంబై నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నిఘా వేసి అక్టోబర్ 20న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆ ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుంది. అదే సమయంలో సోనిపట్‌లో కునాల్, సుమిత్‌లను కూడా అరెస్ట్ చేశారు. అంతకుముందు రాజస్థాన్‌లోని కోటా పోలీసులు హర్యానాకు చెందిన ఇద్దరు, బీహార్‌కు చెందిన ఒకరు సహా ముగ్గురు ప్రధాన షూటర్లను అరెస్ట్ చేసి ముంబై పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా పట్టుబడిన నలుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా, ముంబై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) వారిని విచారించేందుకు మూడు రోజుల రవాణా రిమాండ్‌ను పొందింది. ఈ ఆయుధ రాకెట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఎవరి ఆదేశాలతో ఈ దాడులు జరిగాయనే కోణంలో ముంబై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఇప్పుడు ఎనిమిదికి చేరింది.

 

[Tiger Shroff Firing Case, Tiger Shroff Firing Case Four Members Arrested including Two women, Tiger Shroff firing case, Lawrence Bishnoi gang, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]


  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com