Home

»

Bollywood News

కాల్పులకి కారణం ఇదే: విచారణలో చెప్పేసిన నిందితులు.. ఎంత సిల్లీ రీజన్ అంటే! 

Oct 24, 2026 4:53PM


భారతీయ సినీ ప్రేమికుల్లో 'టైగర్ ష్రాఫ్‌'పై జరిగిన కాల్పులు తాలూకు వేడి తీవ్రత ఇంకా తగ్గనే తగ్గలేదు. ఈ హైప్రొఫైల్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన ముంబై పోలీసుల విచారణలో రోజుకో సంచలన నిజం వెలుగులోకి వస్తోంది. అసలు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఈ దారుణమైన దాడికి పాల్పడటానికి గల అసలు కారణం ఏమిటనే దానిపై పోలీసుల విచారణలో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. 

దర్యాప్తులో భాగంగా నిందితులను ప్రశ్నించగా ఆసక్తికరమైన కోణాలు వెలుగుచూశాయి. 2022లో జరిగిన ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టైగర్ ష్రాఫ్ మాట్లాడిన కొన్ని మాటలే ఈ ఘోరానికి ప్రధాన కారణమని నిందితుల్లో ఒకరు పోలీసుల విచారణలో స్పష్టంగా అంగీకరించినట్లుగా తెలుస్తుంది.ఆనాటి ప్రచార కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఉద్దేశించి టైగర్ ష్రాఫ్ మాట్లాడుతూ, "టైగర్ అనే పేరు ఇండస్ట్రీలో ఎంత మందికైనా ఉండొచ్చు, కానీ అసలైన టైగర్ మాత్రం ఒక్కరే.. ఆయనే సల్మాన్ ఖాన్" అంటూ ప్రశంసలు కురిపించారు.

ఇది కూడా చదవండి: హనుమాన్ అంశ్ తెలుగులో ఎందుకు ఆడలేదు? అసలు కారణం ఇదేనా!

 

 

ఆ వ్యాఖ్యలే తమ ఆగ్రహానికి కారణమయ్యాయని, అందుకే టార్గెట్ చేసుకుని దాడికి  ప్లాన్ చేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.  

 

[Tiger Shroff Attack Reason, Tiger Shroff, Salman Khan attack, Tiger Shroff firing case, Mumbai police investigation, Bollywood news, financial transactions, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com