ఆయుధాల విషయంలో నిజం ఒప్పుకున్నసంజయ్ దత్.. షాక్ లో అభిమానులు
on Dec 3, 2025

-అసలు నిజం చెప్పిన సంజయ్ దత్
-భారతీయ సినిమా ఎప్పుడు ఒకటే
-ది రాజా సాబ్ తో సత్తా చాటనున్నాడు
లాంగ్వేజ్ లు వేరైనా భారతీయ సినిమా ఒక్కటే అని నిరూపించే లెజండ్రీ యాక్టర్స్ లో 'సంజయ్ దత్'(Sanjay Dutt)కూడా ఒకరు. ఆ మాటకొస్తే హీరోగా మూడున్నర దశాబ్దాలపై నుంచే భారత దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు సిల్వర్ స్క్రీన్ పై తన మ్యాజిక్ కి ఎక్స్ పైరీ డేట్ ఇప్పట్లో లేదని చాటి చెప్తున్నాడు. వచ్చే సంక్రాంతికి 'ది రాజాసాబ్'(The Raja Saab)తో పాన్ ఇండియా వ్యాప్తంగా మరోసారి తన సత్తా చాటడం ఖాయం.
రీసెంట్ గా సంజయ్ దత్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన గత జీవిత విశేషాల గురించి అభిమానులతో, ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. సంజయ్ దత్ మాట్లాడుతు బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత నా కుటుంబం ఎన్నో బెదిరింపులని ఎదుర్కొంది. ఆ తర్వాత నా దగ్గర గన్ ఉందని అరెస్ట్ చేసి ఐదేళ్ల పాటు జైల్లో ఉంచారు. కానీ నా దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు. ఇది నిరూపించడానికి పాతిక సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఇప్పటికి అర్ధం కావడం లేదు. కానీ జైలు జీవితాన్ని ఒక పాఠంగా భావించి ఎన్నో మత గ్రంధాలు చదివాను. న్యాయశాస్త్రంలో ఉన్న అన్నిచట్టాల గురించి అవగాహన చేసుకొని కేసుని త్వరగా పరిష్కరించమని అడిగాను. కానీ ఎవరు పట్టించుకోలేదు.
also read: అఖండ 2 పై నారాయణ ఫైర్.. ఓజి కి ఎంత రేట్ చెప్పారు
ఇప్పటికి ఎంతో మంది నిరపరాధులు అన్యాయంగా జైళ్లల్లో మగ్గుతున్నారు. నా జైలు జీవితంపై ఎలాంటి బాధ లేదు. నా తల్లి తండ్రులు త్వరగా చనిపోయారనే బాధ తప్ప నాకు ఇంకేం బాధ లేదు. ఆ బాధ జీవితాంతం వెంటాడుతుందని సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు అభిమానులని ఎంతో హార్ట్ టచింగ్ కి గురి చేస్తున్నాయి. 1993 లో ముంబై వరుస బాంబు పేలుళ్లు జరిగినప్పుడు సంజయ్ దత్ దగ్గర లైసెన్సు లేని గన్ దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ కేసులో 2013 నుంచి 2016 వరకు జైలులో ఉన్నాడు.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



