Home

»

Bollywood News

సల్మాన్ ఖాన్ ముందు భోరున ఏడ్చేసిన డైరెక్టర్.. సూపర్ అంటున్న ఫ్యాన్స్ 

Oct 14, 2026 3:02PM

 

భారతీయ చిత్ర పరిశమ్ర ఉన్నంత కాలం సల్మాన్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్ తాలూకు హిస్టరీ రికార్డ్స్ ఎప్పటికప్పుడు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కుచ్ కుచ్ హోతా హై. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సరికొత్త కథలకి పురుడు పోసిన మూవీ.  కల్ట్ క్లాసిక్  అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


షారుఖ్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ జంటగా చేసిన ఈ మూవీతోనే  కరణ్ జోహార్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ 'అమన్' పాత్రలో ఒక ప్రత్యేకమైన అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కారణంగా కరణ్ జోహార్ ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహార్ రీసెంట్ గా జరుగుతున్న ఒక ఇంటర్వ్యూలో పంచుకోవడంతో ఈ సంఘటన బయటకు వచ్చింది. మూవీలో అత్యంత పాపులర్ అయిన 'సాజన్ జీ ఘర్ ఆయే' పాట షూటింగ్ మొదలయ్యే సమయానికి ఈ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ తో అప్పట్లో మొదటిసారి పనిచేస్తుండటంతో కరణ్ జోహార్ లో ఒక టెన్షన్, భయం ఉండేది. మొదటి రోజు సెట్ కి వచ్చిన సల్మాన్ ఖాన్ తన వ్యాన్ లో సాధారణంగా టీ-షర్ట్ మరియు జీన్స్ ధరించి కనిపించారు. 


ఇది కూడా చదవండి: ఇదే చివరి చిత్రమా!

 

అప్పుడు కరణ్ జోహార్ సల్మాన్ దగ్గరకు వెళ్లి ఇది చాలా గ్రాండ్ గా తెరకెక్కించే పెద్ద పెళ్లి సెట్ అని, అందరూ సాంప్రదాయ దుస్తుల్లో ఉంటారని చెప్పారు.   దీనికి సల్మాన్ ఖాన్ చాలా సరదాగా, ఒక కొత్త ఆలోచన చెప్పారు. పెళ్లి కొడుకు మొదటిసారిగా జీన్స్, టీ-షర్ట్ ధరించి వస్తే ఎలా ఉంటుందని, ఇది ఇండస్ట్రీలో ఒక సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని, తాను అదే స్టైల్ తో సెట్లోకి వస్తానని సల్మాన్ నవ్వుతూ అన్నారు. దీన్ని విని కరణ్ జోహార్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. మరోవైపు కాజోల్ అత్యంత క్లిష్టమైన, బరువైన లెహెంగా ధరించి ఉన్నందున, హీరో మాత్రం జీన్స్ లో ఉంటే ఆ సీన్ సరిగ్గా సెట్ కాదని కరణ్ తీవ్ర ఆందోళన చెందారు.

 

 

  

సల్మాన్  తన పట్టు వీడకపోవడంతో, ఒత్తిడిని తట్టుకోలేక కరణ్ జోహార్ బోరున ఏడ్చేశారు. తన మొదటి సినిమా అని, దయచేసి ఇలా చేయవద్దని కరణ్ కన్నీరు మున్నీరుగా విలపించారు. దర్శకుడు అలా ఏడవడం చూసి కొద్దిగా కంగారుపడిన సల్మాన్, వెంటనే కూల్ అయ్యి "అరే... నువ్వు టెన్షన్ పడకు, ఎందుకు ఏడుస్తున్నావ్? నేను కచ్చితంగా సూట్ వేసుకుంటాను" అని ఓదార్చారు. ఆ తర్వాత సల్మాన్ మనసు మార్చుకుని సాంప్రదాయ సూట్ ధరించి ఆ పాటలో నటించడంతో షూటింగ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా పూర్తయింది. ఇక ఈ ఇంటర్వ్యూ చేసిన అభిమానులు సల్మాన్ కి హాట్స్ హాఫ్ చెప్తున్నారు.కరణ్ జోహార్  యొక్క తపనకి కూడా.


     
[Salman Khan Made Karan Johar Cry During kuch kuch hota hai shoot, Salman Khan in Coffee With karan, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com