
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గతంలో ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరుతో ప్రకటించిన ఈ సినిమాను ఇప్పుడు ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ పేరుతో విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
2020లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. గల్వాన్ ఘటనలో అమరుడైన తెలంగాణకు చెందిన బిక్కుమల్ల సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ కనిపించనున్నారు.
ట్రైలర్ ప్రారంభంలో మంచుతో కప్పుకున్న లడఖ్ ప్రాంతం కనిపిస్తుంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ సంతోష్ బాబు పాత్రలో పరిచయమవుతారు. దేశం కోసం విధులకు వెళ్లే సైనికుడిగా, మరోవైపు భార్యాబిడ్డలపై ప్రేమ చూపించే కుటుంబ పెద్దగా ఆయన పాత్రను చూపించారు.

సరిహద్దుల్లో చైనా సైనికులు తమ బలగాలను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు మొదలవుతాయి. మొదట చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని సల్మాన్ ప్రయత్నిస్తారు. యుద్ధం చేయడం మాత్రమే ధైర్యం కాదని, యుద్ధాన్ని ఆపడం కూడా ధైర్యమేననే భావన ఆయన పాత్రలో కనిపిస్తుంది. అయితే అవతలి వైపు నుంచి ఎదురయ్యే సవాళ్లు, భారత సైనికులను వెనక్కి వెళ్లమని హెచ్చరించడం.. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తాయి.
ఇది కూడా చదవండి: విడాకుల తర్వాత మళ్ళీ కలిసిపోయిన స్టార్ కపుల్.?
ట్రైలర్లో సల్మాన్ ఖాన్, చైనా సైనికుల మధ్య జరిగే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా సైనికుల సంఖ్య ఎక్కువగా ఉన్నా వెనక్కి తగ్గేది లేదనే ధోరణిలో సల్మాన్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘ఏక్ బిహారీ, సౌ పే భారీ’ అనే డైలాగ్ కూడా ట్రైలర్లో ప్రత్యేకంగా నిలిచింది.
మరోవైపు సైనికుడి కుటుంబం ఎదుర్కొనే భావోద్వేగాలను కూడా దర్శకుడు చూపించారు. సల్మాన్ భార్య పాత్రలో చిత్రాంగద సింగ్ కనిపిస్తున్నారు. ఎప్పుడు ఇంటికి తిరిగి వచ్చినా గాయాల గుర్తులు కాకుండా యుద్ధం గురించిన కథలు మాత్రమే తీసుకురావాలని ఆమె చెప్పే మాటలు ఎమోషనల్‌గా ఉన్నాయి. యుద్ధంలో గెలుపోటముల కంటే సైనికుల ప్రాణాలు, వారి కుటుంబాల బాధ ఎంత ముఖ్యమో ట్రైలర్ గుర్తుచేస్తోంది.
ఈ సినిమా కేవలం దేశభక్తి, యాక్షన్ సన్నివేశాలకే పరిమితం కాకుండా యుద్ధం వల్ల సైనికులు, వారి కుటుంబాలు ఎదుర్కొనే బాధను కూడా చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. శత్రువులను అంతం చేయడంలోనే దేశభక్తి లేదని, శత్రుత్వాన్ని అంతం చేయడంలోనూ మానవత్వం ఉందనే సందేశంతో ట్రైలర్ ముగుస్తుంది.
దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సల్మా ఖాన్ నిర్మిస్తున్నారు. చిత్రాంగద సింగ్‌తో పాటు జైన్ షా, అంకుర్ భాటియా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హిమేశ్ రేషమ్మియా సంగీతం అందిస్తున్నారు.
డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. మరి గల్వాన్ ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
మీకు నచ్చవచ్చు:
హారిక హాసినితో త్రివిక్రమ్ బంధం తెగిపోనుందా?.. గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి.?
‘వారణాసి’ స్టోరీ లీక్.. రావణుడి నవరత్నాల హారం చుట్టూ అసలు కథ.!
[Salman Khan Maatrubhumi Trailer, Colonel Bikkumalla Santosh Babu, Salman Khan Maatrubhumi Movie, Maatrubhumi Trailer, Salman Khan, B Santosh Babu, Battle of Galwan, Galwan Valley Clash, India Vs China]




