Home

»

Bollywood News

Salman Khan: సల్మాన్ ఖాన్ కన్నీళ్లు.. పదిహేను కోట్ల విరాళం ఇచ్చాడు మరి 

May 18, 2026 5:24PM


సల్మాన్ ఖాన్(Salman Khan)స్క్రీన్ పైనే హీరోగా కాకుండా నిజ జీవితంలోను ఎంతో మందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి.ఆ కోవలోనే ఇటీవల ఒక పాఠశాల అభివృద్ధి కోసం తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా 15 కోట్ల రూపాయిల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఆ స్కూల్ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారికి మెరుగైన వసతులు కల్పించడం కోసమే ఆ సాయాన్ని అందించాడు. కానీ ఆ తర్వాత జరిగిన  సంఘటన సల్మాన్ ఖాన్‌ ని  ఎంతగానో కదిలించివేసింది.

ఆ పాఠశాలకు చెందిన చిన్నారి విద్యార్థులు తమకి ఎంతో సాయం చేసిన సల్మాన్ కి  కృతజ్ఞతలు తెలియజేయాలని వాళ్లంతా ఎంతో ప్రేమతో, సొంతంగా తయారు చేసిన  హ్యాండ్ మేడ్ గిఫ్ట్ ని సల్మాన్ కి  బహుమతిని అందించారు. ఆ బహుమతిని చేతుల్లోకి తీసుకోగానే  ఆ పసిపిల్లల నిష్కల్మషమైన ప్రేమ, వారు చూపించిన ఆదరణని చూసిన సల్మాన్ ఖాన్ ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కళ్లల్లో నీళ్లు అయితే ఆగలేదు. ఎప్పుడూ ఎంతో ధైర్యంగా, గంభీరంగా కనిపించే సల్మాన్  ఆ పిల్లల ముందు  చిన్న పిల్లాడిలా మారిపోయి కన్నీళ్లు పెట్టుకోవడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి, గురిచేసింది.

Aslo read: Peddi: ట్రైలర్ తర్వాత అర్ధమైన నిజం ఇదే  

ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు, అభిమానులు సల్మాన్ ఖాన్ ఉదార స్వభావాన్ని, ఆయనకున్న మంచి  మనసుని  కొనియాడుతున్నారు.  సినిమాల పరంగా చూసుకుంటే సల్మాన్ ప్రస్తుతం మాతృభూమి అనే సినిమాతో పాటు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నాడు.

 

 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com