
అభిమాని లేనిదే హీరో లేడు అనే సూత్రం హీరోయిన్ కి వర్తిస్తుంది అనే మాట మరో సారి నిరూపితమైంది.బాలీవుడ్, సౌత్ సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి, మోడల్ నికితా రావల్ ఊహించని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన ఒక ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవంలో రెడ్ కార్పెట్‌పై మీడియా కెమెరాల ముందు నికితా రావల్ స్టైలిష్‌గా పోజులిస్తూ సందడి చేస్తున్నారు. ఆ సమయంలో ఆమెను చూడటానికి ఒక మహిళా అభిమాని దగ్గరకు వచ్చింది. సాధారణంగా అభిమానులు స్టార్‌లతో సెల్ఫీలు దిగడానికి లేదా ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ సందర్భంలో ఆ అభిమాని ప్రవర్తించిన తీరు అక్కడున్న వారిని, చివరికి నెటిజన్లని సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రెడ్ కార్పెట్ వద్ద నికితా రావల్ నవ్వుతూ ఆ అభిమానికి సెల్ఫీ ఇచ్చేందుకు అంగీకరించారు. ఫోటో దిగే క్రమంలో ఆ అభిమాని ముందుగా నికితా చెంపపై ముద్దు పెట్టుకుంది. అంతటితో ఆగకుండా, క్షణాల్లో ఊహించని విధంగా నికితా రావల్‌ను తనవైపు బలంగా లాక్కొని ఏకంగా పెదవులపై ముద్దు (లిప్ కిస్) ఇచ్చేసింది. ఈ ఊహించని ఘటనా పరిణామంతో నటి నికితా రావల్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆమె వెంటనే ఆ అభిమానిని పక్కకు తోసివేసేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ మహిళ మళ్లీ నటి చెంపపై ముద్దు పెట్టుకుని అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న పాపారాజీల కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ ఘటనతో నికితా రావల్ కొంత అసౌకర్యానికి గురైనప్పటికీ, ఏమాత్రం కోపాన్ని ప్రదర్శించకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్షమైన కొద్ది నిమిషాల్లోనే తుఫానులా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సినీ ప్రముఖుల భద్రత, వారి వ్యక్తిగత స్వేచ్ఛ (ప్రివసీ) గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అభిమానం పేరిట హద్దులు మీరి ప్రవర్తించడం సరికాదని, సెలబ్రిటీల వ్యక్తిగత సరిహద్దులను గౌరవించాలని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇలాంటి ఘటనలకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం పబ్లిసిటీ కోసమే ఈ తరహా ఘటనలు ప్లాన్ చేశారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.
ముంబైలో జన్మించి ప్రతిష్టాత్మక మిథిబాయి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన నికితా రావల్, 'మిస్టర్ హాట్ మిస్టర్ కూల్' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత అనిల్ కపూర్, షెఫాలీ షా నటించిన 'బ్లాక్ అండ్ వైట్', అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం నటించిన సూపర్ హిట్ సినిమా 'గరం మసాలా', అలాగే 'అమ్మీ కీ బోలీ', 'క్యూట్ కమీనా' వంటి పలు బాలీవుడ్ చిత్రాలలో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో కూడా ఆమె 2012 లో వచ్చిన 'తింపా' అనే చిత్రంలో విక్రమ్ రాయ్ సరసన ఇచ్చాధారి నాగిని పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆమె అర్షద్ వార్సీ, చంకీ పాండేలతో కలిసి 'రోటీ కప్డా అండ్ రొమాన్స్' అనే చిత్రంలో నటిస్తున్నారు. నికితా రావల్ గతంలో కూడా ఒక చేదు సంఘటనను ఎదుర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు దాదాపు 7 లక్షల విలువైన నగలు, నగదును గన్ పాయింట్‌లో దుండగులు దోచుకెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
Nikita Rawal, Garam Masala, Bollywood





