
-మయాంక్ పవార్ చనిపోవడానికి కారణం ఏంటి
-ఎందుకు ఆ వివరాలు బయటకి రావడం లేదు
-షాక్ లో ఫ్యాన్స్ తో పాటు ఫిట్ నెస్ ప్రేమికులు
ప్రముఖ నటుడు మయాంక్ పవార్(Mayank pawar)విషయంలో ఉదయాన్నే ఇలాంటి దురవార్తని వినవలసి వస్తుందని అభిమానులు అసలు అనుకోలేదు. ఈ వార్త అబద్దం అయితే బాగుండని కోరుకొని క్షణం కూడా లేదు. అంతలా మయాంక్ తన అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. పూర్తి డీటెయిల్స్ చూద్దాం.
మయాంక్ పవార్.. MTV నిర్వహించిన స్ప్లిట్స్‌విల్లా సీజన్ 7లో అత్యంత ప్రజాదరణ పొందిన కంటెస్టెంట్స్ లో ఒకరు. ఫిట్‌నెస్ ప్రపంచంలో అయితే మిస్టర్ ఇండియా టైటిల్ ని ఏడుసార్లు గెలుచుకుని విశేష ప్రాచుర్యాన్ని పొందాడు. మిస్టర్ ఆసియా టైటిల్ కూడా మయాంక్ సొంతమయ్యింది.బాడీబిల్డింగ్, ఫిట్‌నెస్ రంగాల్లో మయాంక్ ని ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. కారణాలు ఇంకా బయటకి రాలేదు కాని మయాంక్ చనిపోవడం జరిగింది. ఈ విషయం నిన్న వెలుగులోకి రావడంతో పాటు కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా మరణం విషయాన్ని ధ్రువీకరించారు. సోదరుడు, ఛాంపియన్, గురువు, చాలా మందికి స్ఫూర్తిదాయకమైన మయాంక్ పవార్ ఎల్లప్పుడూ మన హృదయాల్లో నిలిచి ఉంటాడు. ఈ రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు రాణా ప్రతాప్ బాగ్‌లోని సంగం పార్క్‌లోని వాల్మీకి ఆలయంలో సంతాప సమావేశం జరుగుతుందని కూడా తెలియచేయడం జరిగింది.
also read: ప్రముఖ యూ ట్యూబర్ కోమలి ఆత్మహత్య.. కారణం ఇదేనా!
మయాంక్ హఠాన్మరణం పట్ల పలువురు సినీ, టీవీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మయాంక్ ఇటీవలే తన 37 వ పుట్టిన రోజుని జరుపుకొన్నాడు. అంతలోనే ఈ తీవ్ర విషాదం జరిగింది. జనవరి 1, 1989 డేట్ ఆఫ్ బర్త్.







