
సినిమా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న జంటలు మళ్లీ కలిసి కనిపిస్తే నెటిజన్లలో ఆసక్తి మరింత పెరుగుతుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఈషా డియోల్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. భర్తతో విడిపోయిన తర్వాత అతడితో కలిసి ఓ వేడుకలో కనిపించడంతో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బాలీవుడ్ సీనియర్ నటులు ధర్మేంద్ర, హేమమాలిని కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈషా డియోల్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ధూమ్, దస్, నో ఎంట్రీ వంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే కెరీర్ కంటే కూడా ఆమె వ్యక్తిగత జీవితం చాలాసార్లు వార్తల్లో నిలిచింది.
2012 జూన్‌లో వ్యాపారవేత్త భరత్ తఖ్తానీని ఈషా వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దాదాపు 12 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ జంట.. 2024 ఫిబ్రవరిలో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. తాము పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని, తమ ఇద్దరు పిల్లల సంక్షేమమే తమకు ముఖ్యమని ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. విడిపోయిన తర్వాత కూడా పిల్లల విషయంలో ఇద్దరూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు.

అయితే భరత్ తఖ్తానీ 2025లో మేఘన లఖానీ అనే దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తతో తన రిలేషన్‌షిప్‌ను సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. దీంతో ఈషా, భరత్ మళ్లీ కలిసే అవకాశం లేదని చాలామంది భావించారు.
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా సంచలన నిర్ణయం.!
కానీ తాజాగా ముంబైలో జరిగిన దీపావళి వేడుకల్లో ఈ మాజీ జంట కలిసి కనిపించింది. ఓ దీపావళి పార్టీలో ఈషా, భరత్ ఇద్దరూ పాల్గొన్నారు. అక్కడ ఫొటోగ్రాఫర్లకు కలిసి నవ్వుతూ ఫోజులిచ్చారు. వీరిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే విడిపోయిన తర్వాత ఈషా, భరత్ కలిసి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ స్నేహితులతో కలిసి లంచ్‌కు వెళ్లిన సమయంలో ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. అంతేకాదు.. భరత్ పుట్టినరోజు సందర్భంగా ఈషా సోషల్ మీడియాలో విషెస్ చెప్పడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది.
మరోవైపు పిల్లల పెంపకం విషయంలో తామిద్దరం ఒకే మాట మీద ఉంటామని గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈషా వెల్లడించారు. భార్యాభర్తల మధ్య బంధం మారినంత మాత్రాన పిల్లలపై దాని ప్రభావం పడకూడదని, తల్లిదండ్రులుగా ఇద్దరూ కలిసి ఉండటం ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు దీపావళి వేడుకల్లో కలిసి కనిపించడంతో వీరిద్దరూ మళ్లీ ఒక్కటయ్యారా? అనే సందేహాలు మొదలయ్యాయి.
మీకు నచ్చవచ్చు:
23 ఏళ్ళ క్రితం జరిగింది ఇదే.. పవన్ కళ్యాణ్ వదులుకున్న తమిళ అమ్మాయి.!
బాలయ్యతో భీష్మ.. 17 ఏళ్ళ క్రితం ప్లాన్ చేసిన క్రేజీ మూవీ.. ఎందుకు ఆగిపోయింది.?
[Esha Deol Reunites With Ex Husband, Esha Deol Bharat Takhtani, Esha Deol Viral Video, Esha Deol Divorce, Esha Deol Reunion, Esha Deol, Bharat Takhtani, Bollywood News]




