Epstein Files: ఎప్ స్టీన్ కుంభకోణంలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు!
on Feb 5, 2026

-వరల్డ్ వైడ్ గా హీట్ ని కలిగిస్తున్న ఎప్ స్టీన్
-ఎప్ స్టీన్ ఏం చేసేవాడు
-ఫైల్స్ లో ఉన్న పేర్లు ఎవరివి
- అసలు అవన్నీ నిజాలేనా!
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఉహించెదరో... ఎందరో మహానుభావులు, అందరికి వందనాలు... ఎక్కడికి నీ పయనం.. అనే ఈ మూడు సాంగ్స్ వినాలంటే సోషల్ మీడియాని సంప్రదించాల్సిందే. కానీ ఇప్పుడు సోషల్ మీడియానే ఈ మూడు సాంగ్స్ ని పాడుకోవాల్సిన పరిస్థితి. ఆ అవకాశం ఎప్ స్టీన్ ఫైల్స్(Epstein Files)ద్వారా రావడమే కాకుండా ఆ సంస్థ మరిన్ని రోజుల్లో ఎవరెవరి పేర్లు బయటపెట్టి కాస్తో కూస్తో ఉన్న తన పరువుని బజారున వేస్తుందేమో అని సోషల్ మీడియా దిగులుతో ఉంది. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణం..ప్రస్తుతం వరల్డ్ మొత్తాన్ని హీట్ ఎక్కిస్తున్న మ్యాటర్. ఇప్పటికే ఊహించడానికి కూడా అవకాశం లేని ప్రముఖుల పేర్లు బయటకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ సినీ సెలబ్రటీస్ పేర్లు ఉన్నాయనే న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ఎప్ స్టీన్ ఏర్పాటు చేసిన విందుకి కొంత మంది బాలీవుడ్ సెలబ్రటీస్ హాజరయ్యారని, ఈ మేరకు ఎప్ స్టీన్ కి మెయిల్స్ కూడా చేసారనే కథనాలు చాలా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ముందు ముందు ఎవరెవరి పేర్లు బయటకి వస్తాయో, సదరు కుంభకోణం మ్యాటర్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ప్రముఖ భారతీయ, అమెరికన్ రచయిత దీపక్ చోప్రా(Deepak Chopra)పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్ లో బయటకి వచ్చింది. ఈ విషయంపై ఆయన స్పందిస్తు ఎప్‌స్టీన్ తో నా పరిచయం చాలా సన్నితమైంది. వివాదాస్పద లైంగిక నేరాల ఘటనతో నాకు సంబంధం లేదని చెప్పాడు.
also read: madhavan:మాధవన్ ని ఇంటి నుంచి గెంటేసిన భార్య.. మొన్ననే పద్మశ్రీ కూడా ప్రకటించారు
ఎప్‌స్టీన్ అనే వ్యక్తి అమెరికాకి చెందిన కుబేరుడు తో పాటు లైంగిక నేరస్తుడు. 2002 ,2005 సంవత్సరాల మధ్య మైనర్ బాలికలని లైంగికంగా వేధించి పలువురు అమెరికా అగ్రనేతలు, సంపన్నులకి వారిని సరఫరా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న ఈ కేసులో కోర్టుకు సమర్పించిన దాదాపు 30 లక్షల పేజీల పత్రాలని అమెరికా న్యాయశాఖ ఎప్‌స్టీన్ ఫైల్స్ పేరుతో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగానే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.ఎప్‌స్టీన్ పూర్తి పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్. 2019 లోనే జైలు శిక్ష అనుభవిస్తుండగా సూసైడ్ చేసుకొని చనిపోయాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



