Home

»

Bollywood News

Awarapan 2: 19 ఏళ్ళ తర్వాత వస్తున్న కల్ట్ క్లాసిక్ సీక్వెల్ 

Jun 29, 2026 4:24PM

 


బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం కాలంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. అలాంటి ఒక కల్ట్ క్లాసిక్ క్రైమ్ డ్రామా చిత్రం 'అవరపన్' (Awarapan). సరిగ్గా 19 ఏళ్ల క్రితం 2007 జూన్ 29న విడుదలైన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ సాధించలేకపోయినా, ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులలో ఒక భారీ కల్ట్ స్టేటస్‌ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, ఇమ్రాన్ హష్మీ పలికించిన ఎమోషన్స్ ఇప్పటికీ ఎంతోమంది సినీ లవర్స్‌కి  ఫేవరెట్. 

ఇప్పుడు సరిగ్గా అదే తేదీన, అంటే జూన్ 29, 2026 సోమవారం నాడు అభిమానులను థ్రిల్‌కు గురి చేస్తూ 'అవారపన్ 2' (Awarapan 2) అఫీషియల్ టీజర్‌ని  మేకర్స్ విడుదల చేశారు. ఈ అప్‌డేట్‌తో బాలీవుడ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ ఇమ్రాన్ హష్మీ మళ్లీ తన ఐకానిక్ పాత్ర 'శివం పండిత్' రూపంలో వెండితెరపైకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఈ సరికొత్త టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటి భాగం ముగింపులో శివం పాత్ర చనిపోయినట్లు చూపించినప్పటికీ, ఈ సీక్వెల్‌లో అతను మళ్లీ ప్రాణాలతో తిరిగి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బౌద్ధ ఆశ్రమంలో చికిత్స పొంది అతను ఎలా బతికాడనే అంశాన్ని టీజర్‌లో కాస్త రివీల్ చేశారు. టీజర్ ప్రారంభంలోనే ఇమ్రాన్ హష్మీ బైక్‌పై వస్తూ, "కొంతమంది కథలు వారి ఇష్టప్రకారం ముగిసిపోవు.. వారి కథలు ఇతరుల కోసం రాయబడతాయి" అంటూ చెప్పే పవర్‌ఫుల్ హిందీ డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అలాగే మొదటి భాగంలో తన ప్రేమని కోల్పోయిన శివం.. ఈ టీజర్‌లో కూడా తన ప్రియురాలు ఆలియా సమాధి వద్ద పూలు ఉంచి నివాళులర్పించడం పాత జ్ఞాపకాలని  గుర్తుచేస్తోంది.


Also read: ఆ హిట్ మూవీ ప్రొడ్యూసర్ తో స్టార్ హీరోయిన్ పెళ్లి

విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై విశేష్ భట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో కేవలం పాత జ్ఞాపకాలే కాకుండా సరికొత్త ట్విస్టులు కూడా జోడించారు. బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటానీ వయోలిన్ వాయిస్తూ ఒక మిస్టరీ పాత్రలో కనిపిస్తుండగా, సీనియర్ నటి శబానా అజ్మీ 'నఫీసా' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో ఎంట్రీ ఇవ్వడం విశేషం. హాంగ్ కాంగ్ బ్యాక్‌డ్రాప్‌లో, నియాన్ లైట్ల వెలుతురులో సాగే యాక్షన్ సీక్వెన్స్, ఇమ్రాన్ హష్మీ సిక్స్ ప్యాక్ లుక్ మరియు అతని రగ్గడ్ అవతార్ అభిమానులకు పూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. వీటన్నింటికీ తోడు, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఐకానిక్ సాంగ్ ‘తో ఫిర్ ఆవో’ రీమేక్ వెర్షన్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. "ఈసారి అయితే ఈ అవారపన్ ముగుస్తుంది.. లేదా నేను ముగుస్తాను" అనే డైలాగ్‌తో టీజర్ ఎండ్ అవ్వడం చూస్తే, శివం చేసే ఈ పోరాటం ఎంత ప్రమాదకరంగా ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ క్రేజీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14 న  థియేటర్లలో విడుదల కానుంది.


 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com