ధురంధర్ 2 కి షాక్ ఇచ్చిన AICWA.. శాశ్వతంగా బ్యాన్ తప్పదా!
on Feb 18, 2026

-ధురంధర్ 2 కోసం ఇండియా మొత్తం వెయిటింగ్
-రంగంలోకి దిగిన AICWA
-సినిమాని నమ్ముకున్న వాళ్ళ ప్రాణాలు ముఖ్యమని వెల్లడి
-శాశ్వతంగా బ్యాన్ తప్పదా!
మార్చి 19 కి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే అందరు టక్కున చెప్పే సమాధానం 'ధురంధర్ పార్ట్ 2'(Dhurandhar 2)రిలీజ్ అని. అంతలా ఇండియన్ మూవీ లవర్స్ ధురంధర్ 2 అప్ డేట్స్ తో సినీ సహజీవనం చేస్తు ఉన్నారు. ఈ క్రమంలోనే పార్ట్ 2 కి సంబంధించిన న్యూస్ ఒకటి రీసెంట్ గా బయటకి వచ్చింది. దీంతో సదరు న్యూస్ ప్రమోషన్స్ లేకుండానే వైరల్ గా మారింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.
మేకర్స్ ధురంధర్ 2(Dhurandhar 2)షూటింగ్ ని శర వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ముంబై లోని బృహన్ముంబై(Bruhan Mumbai)ఏరియాలో జరపాలనే యోచనలో ఉండగా సదరు మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇవ్వలేదు.ఈ విషయంపై ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ స్పందిస్తు ధురంధర్ 2 కి బృహన్ముంబై లో షూటింగ్ కి అనుమతి నిరాకరించే విషయానికి మా మద్దతు ఉంటుంది. పరిశ్రమలో కొన్ని వేల మంది పని చేస్తున్నారు. టెక్నీషియన్స్, వర్కర్స్ భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడకూడదు. మేకర్స్ ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.దీంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా చట్టానికి అతీతులు కాదని తన లేఖలో పేర్కొంది.
Also read: 45 ఏళ్ళ ప్రేమాభిషేకం.. వీడియో బయటకి వచ్చింది
నిజానికి ధురంధర్ పార్ట్ 2 షూటింగ్ బృహన్ముంబై లోని ఒక భవనం టెర్రస్‌పై జరిగింది. ఆ విషయంపై కార్పొరేషన్ అధికారులు స్పందిస్తు సదరు షూటింగ్ కి ముందస్తు అనుమతి తీసుకోలేదు. భద్రత నియమాలు పాటించకపోవడమే కాకుండా షూటింగ్ కోసం ఉపయోగించే జనరేటర్ వ్యాన్లకి ఉండాల్సిన అధికారిక క్లియరెన్స్ పత్రాలు లేవనేది కార్పొరేషన్ ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ధురంధర్ ని నిర్మిస్తున్న బి 62 స్టూడియోకి లక్ష జరిమానా విధించడంతో పాటు సదరు నిర్మాణ సంస్థ బృహన్ముంబై లో శాశ్వతంగా షూటింగ్ జరపకుండా చేయాలనే యోచనలో కూడా అధికారులు ఉన్నట్టుగా తెలుస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



