Home

»

Bollywood News

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ పై అభిషేక్ బచ్చన్ కీలక వ్యాఖ్యలు.. విడిపోతున్నారనే రూమర్స్ నిజమవుతాయా! 

Apr 23, 2026

 


ఒరిజినల్ కి, డూప్లీకేట్ కి ఎంత సారూప్యత ఉందో రీసెంట్ గా అభిషేక్ బచ్చన్(Abhishek bachchan)చెప్పిన మాటలతో అర్ధమవుతుంది. ఫ్యాన్స్ అయితే ఆ కమ్మటి సువాసనతో కూడిన మాటలని తన హృదయంలో భద్రపరుచుకోవడంలో బిజీగా ఉన్నారు. మరి ఆ కమ్మటి సువాసన గల మాటలని మనం కూడా చూద్దాం.

అభిషేక్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన శ్రీమతి, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి మాట్లాడుతు మా ఇద్దరి మధ్య  2000 లో నేను ఐశ్వర్య 'దాయ్ అక్షర్ ప్రేమ్ కే' సెట్స్ లో కలిసాం. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య రిలేషన్ స్నేహపూర్వకంగానే ఉండేది. తనతో లవ్ అనే మాటర్ రాలేదు. కానీ 2006 లో ఉమ్రావ్ జాన్ షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య ఒకరంటే ఒకరికి ప్రేమ అనేది పుట్టింది . గురు టైం లో మరింత బలపడింది. ఐశ్వర్య నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా ప్రపంచం మారిపోయింది. ఆమె నాకు కేవలం భార్య మాత్రమే కాదు, నా కష్టసుఖాల్లో తోడుండే   గొప్ప స్నేహితురాలు, నా సోల్‌మేట్" అని అభిషేక్ చెప్పుకొచ్చారు.


also read: Raaka: రాకాలో మేకప్ కి  అల్లుఅర్జున్ ఎంత సమయం తీసుకుంటున్నాడో తెలుసా!


 న్యూయార్క్‌లోని ఒక హోటల్ బాల్కనీలో నిలబడి, ఒక సినిమా షూటింగ్‌లో వాడిన ఉంగరాన్నే ఆమెకు ఇచ్చి ప్రపోజ్ చేసిన తీరు నాకు ఇంకా గుర్తు. ఐశ్వర్య కూడా ఎలాంటి తడబాటు లేకుండా వెంటనే 'యస్' చెప్పడం నా లైఫ్ లో మరపురాని క్షణమని చెప్పుకొచ్చాడు. దీంతో కొన్ని రోజులుగా అభిషేక్, ఐశ్వర్య ల మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్ళు విడిపోబోతున్నారనే న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు అభిషేక్ మాటలు విని మరింత కుళ్ళు కోవడం ఖాయం. 2007 లో ఆ ఇద్దరు వివాహం జరగగా   ఆరాధ్య అనే పాప ఉంది.

 


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com