
సినిమా వాళ్ళు, సినిమా వాళ్ళని పెళ్లి చేసుకుంటే వచ్చే ఆసక్తికర న్యూస్ కన్నా, సినిమా వాళ్ళు బిజీనెస్ వియ్యమొందారనే న్యూస్ చాలా ఆసక్తి కరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కోవలోనే బాలీవుడ్ ప్రముఖ నటి, సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘యే కాళీ కాళీ ఆంఖేన్’, ‘ఉన్ దేఖీ’లతో ఓటీటీ ప్రియులని విశేషంగా ఆకట్టుకున్న ఆంచల్ సింగ్ సడన్ గా బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రముఖ ఇన్వెస్టర్, బిజినెస్ మ్యాన్ మోహిత్ చావ్లాతో ఆమె ఏడడుగులు నడిచారు. దాదాపు 3 సంవత్సరాలు అంటే దాదాపు 36 నెలల పాటు చాలా రహస్యంగా తమ ప్రేమాయణాన్ని కొనసాగించిన ఈ జంట, చివరకు తమ బంధాన్ని వివాహ వ్యవస్థలోకి అడుగుపెట్టడం ద్వారా అధికారికంగా ఖరారు చేశారు. ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా, ఆర్భాటాలకి దూరంగా సైలెంట్ గా జరిగిన ఈ వివాహ వేడుక సినీ ప్రియుల్లో, నెటిజెన్స్ లో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది.
Also read: తెలుగులో సోలో హీరోగా నిలదొక్కుకోవడం కష్టమేనా.. మరి పాన్ ఇండియా అంటే ఏంటి!
సాధారణంగా నటీనటులు పెళ్లి చేసుకుంటే నెలల తరబడి ప్రకటనలు ఇస్తూ ఉంటారు. కానీ ఆంచల్ సింగ్, మోహిత్ చావ్లా మాత్రం తమ వ్యక్తిగత జీవితానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో తమ గురుద్వారా పెళ్లికి సంబంధించిన అందమైన ఫోటోలను పోస్ట్ చేసే వరకు ఎవరికీ ఈ విషయం తెలీలేదు. నిజానికి ఆ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు, సినీ వర్గాలు అది నిజమైన పెళ్లి కాదని, ఏదైనా కొత్త సినిమా లేదా మ్యూజిక్ వీడియో ప్రమోషన్ కోసం చేసిన పీఆర్ స్టంట్ గా భావించారు. అయితే, అది ప్రమోషన్ కాదని, తన జీవితంలో ప్రారంభమైన ఒక నిజమైన కొత్త అధ్యాయమని ఆంచల్ స్వయంగా స్పష్టం చేసింది.
Aanchal Singh, Mohit Chawla





