Home

»

Bollywood News

Aamir Khan: చనిపోతాననే భయంతోనే ఆ పని చేస్తున్నా.. అమీర్ ఖాన్ సీక్రెట్ నోట్ బయటపడింది 

May 1, 2026 4:45PM

 

భారతీయ సినిమా అమీర్ ఖాన్ ని చూసి ఎంతగా మురిసిపోతుందో అమీర్ ఖాన్(Aamir Khan)కూడా  భారతీయ సినిమా ఎదుగుదలకి చూసి ఎంతో మురిసిపోతూ ఉంటాడు. సినిమా అంటే అంత ప్రాణం. చిరు వయసు నుంచే భారతీయ సినిమా ఎదుగుదలకి కూడా ఎంతో సాయం చేసిన అమీర్ ఖాన్ రీసెంట్ గా తన మాటలతో సినిమాతో పాటు అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పించాడు. మరి ఆ మాటలేంటో చూద్దాం.

రీసెంట్ గా అమీర్ మాట్లాడుతు విమాన ప్రయాణం ఎప్పుడు చేసినా నాకు ప్రాణ భయం. దీంతో ఆ సమయంలో నా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంటే      నా కజిన్, దర్శకుడు మన్సూర్ ఖాన్ కి ప్రమాదంలో నేను  చనిపోయినా సరే సినిమా రిలీజ్ ఆగకూడదు. ఆ పనులన్నీ చూసుకొని నువ్వు  కంప్లీట్ చేసి రిలీజ్ చేయమని నోట్ సెండ్ చేస్తాను. దర్శకులతో కూడా మన్సూర్ కి చెప్పి మూవీని కంప్లీట్ చేయమని చెప్తానని అమీర్ ఖాన్ తన  సీక్రెట్ ని బయటపెట్టాడు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు స్పందిస్తు అమీర్ భయ్యా అలాంటి మాటలు మాట్లాడకు నువ్వు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నపుడు మమ్మల్ని గుర్తు చేసుకో అనే కామెంట్స్ చేస్తున్నారు.


Also read: Kara: కర ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ధనుష్ హిట్ కొట్టినట్లేనా!

  
అమీర్ ఖాన్ కి  మన్సూర్ ఖాన్‌ దూరపు  బంధువు అవుతాడు. ఇద్దరి కాంబోలో 'ఖయామత్ సే ఖయామత్ తక్, జో జీతా వహి సికందర్' వంటి చిత్రాలు వచ్చాయి. అమీర్ ప్రస్తుతం నిర్మాతగా ఏక్ దిన్ తో థియేటర్స్ లో ఉన్నాడు. అమీర్ తనయుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి జంటగా చేసారు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com