English | Telugu

సినిమాల్లో నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని.. బిగ్ బాస్ రెండో సీజన్ కి హోస్ట్ గా బుల్లితెర మీద కూడా సందడి చేస్తున్నాడు.. అయితే రెండో సీజన్ మొదటి సీజన్ లాగా సాఫీగా సాగట్లేదు.. సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. కొందరు నెటిజన్లు హోస్ట్ నాని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శిస్తారు.. తనపై వస్తున్న విమర్శల నేపథ్యంలో నాని సోషల్ మీడియాలో స్పందించి వివరణ ఇచ్చారు.. 'మీతో ఓ విషయం పంచుకోవాలని ట్విటర్‌లోకి వచ్చా.. బిగ్‌బాస్‌ గురించి మీరు చేసిన కామెంట్స్‌ చూశాను.. నేను మీకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని టీమ్ చెప్పింది.. కానీ ఇవ్వకుండా ఎలా ఉండగలను.. ఇదిగో షోకు సంబంధించి నా చివరి స్పందన’ అంటూ నాని ట్వీట్‌ చేశారు.

'పక్షపాతంతో నేను వ్యవహరిస్తున్నానని మీరు ఫీలయితే మాత్రం సారీ గైస్.. కానీ మీరంతా మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నారనే విషయాన్ని తెలుసుకోవాలి.. ప్రతి ఒక్కసారి మీ ఫేరవెట్ పార్టిసిపెంట్ స్పెషల్ ట్రీట్ చేయబడాలి అని మీరు కోరుకుంటున్నారు.. కానీ ఒక హోస్ట్‌గా నేను ఆ పని చేయలేకపోతున్నా.. నేను ప్రతి ఒక్కరినీ ఒకేలా చూడాల్సి ఉంటుంది.. మీరు ఎవరో ఒక్కరిని మాత్రమే ఇష్టపడతారు కాబట్టి నేను ప్రతి ఒక్కరినీ న్యూట్రల్‌గా చూడటం మీకు నచ్చకపోవచ్చు.. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఓ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉన్నారు అతనితో లేదంటే ఆమెతో మీరు కనెక్ట్ అయి ఉన్నారు.. దీంతో నేను మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి కాకుండా వేరొకరికి సమాన స్థాయి ఇస్తే నేను మీకు బయాస్డ్‌గా కనిపించవచ్చు.. కానీ నన్ను నమ్మండి.. అక్కడున్నవారంతా నాకు సమానమే.. మీ అందరి సపోర్ట్‌, మీ ఓటింగ్, ఎలిమినేషన్స్‌తో వారిలో బెస్ట్ వన్ గెలుస్తారని మేమంతా భావిస్తున్నాం.. ఒకవేళ నేను చెప్పిన వారే గెలుస్తారని మీరు నిజంగా భావిస్తే, అప్పుడు నిర్ణయాన్ని నేను మీకే వదిలేస్తా.. యాక్టర్‌గా, హోస్ట్‌గా నేను మీకు బెస్ట్‌గానే ఇస్తాను.. నా మనసాక్షి చాలా క్రిస్టల్ క్లియర్‌‌గా ఉంది.. నన్ను ద్వేషించినా, ప్రేమించినా మీరు నా ఫ్యామిలీ.. కానీ మీరు నన్ను అపార్థం చేసుకుంటే అది నన్ను ఇబ్బంది పెడుతుంది.. నేను మీ ప్రేమతో మరింత బెటర్‌గా చేసేందుకు ప్రయత్నిస్తా' అని నాని తెలిపారు.. ఇప్పటికైనా నాని మీద విమర్శలు ఆగుతాయేమో చూడాలి మరి.