RELATED NEWS
NEWS
కొలంబస్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన

 

కొలంబస్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన

 

 



కొలంబస్ లో నాట్స్ నిర్వహించిన వాలీ బాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది.. దాదాపు 200 మంది ఈ టోర్నమెంట్ లో పాలుపంచుకున్నారు. సెప్టెంబర్ 11 దాడులు జరిగి 15 సంవత్సరాలు కావడంతో ఈ టోర్నమెంటు ప్రారంభంలో ఇక్కడ చేరుకున్న ఆటగాళ్లు, ప్రజలు అంతా కాసేపు మౌనం పాటించారు. సెప్టెంబర్ 11 దాడుల్లో మృతులకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థించారు. ఆ తర్వాత ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్ ఆద్యంతం ఆహ్లదకరంగా సాగింది. అమెరికాలోని న్యూయార్క్, ఇలినాయిస్ తో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆటగాళ్లు ఈ వాలీబాల్ టోర్నమెంటులో పాల్గొన్నారు. హిలియర్డ్ హిట్టర్స్ టీం నాట్స్ కొలంబస్ ఛాప్టర్ 2016 కప్ ను సొంతం చేసుకుంది. రెండవ బహుమతిని  చికాగో టీం, డుబిలిన్ స్పైకర్స్  మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. రన్నర్స్, విన్నర్స్ కు ఈ బహుమతులు నిర్వహకులు అందించారు.



న్యూయార్క్ లైఫ్ టైం ఏజెంట్ వేణు తలశిల, డుబ్లిన్ మెట్రో డెంటల్ ఈ వాలీబాల్ టోర్నమెంట్ కు గ్రాండ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి. నాట్స్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్ కేశాని,  నాట్స్ జాతీయ కమిటీ సభ్యులు సురేష్ పూదోట, నాట్స్ కొలంబస్ చాప్టర్ కో ఆర్డినేటర్  కోటేశ్వరరావు బోడెపూడి, నాట్స్ కొలంబస్ చాప్టర్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్  ఫణి పొట్లూరి నాట్స్ ఈవెంట్ కో ఆర్డినేటర్ జగన్ చలసాని, నాట్స్ వుమెన్స్  కో ఆర్డినేటర్  నవ్య కుప్ప తదితర ప్రముఖులు.. ట్రోఫీలు,నగదు బహుమతులు అందించారు.


ఈ టోర్నమెంటు కోసం పనిచేసిన వాలంటీర్లందరికి శ్రీధర్ కేశాని ధన్యవాదాలు తెలిపారు. విజేతలను అభినందించారు. వచ్చే ఏడాది చికాగోలో జరగనున్న నాట్స్ సంబరాలు.. అందులో జరిగే కార్యక్రమాల గురించి శ్రీధర్ కేశాని తెలిపారు.

 



  కొలంబస్ మనాస్ రెస్టారెంట్ 200 మంది అతిధులకు ఉచితంగా విందును ఏర్పాటు చేసింది. కవిత పొట్లూరి, శ్యామ్ గద్దె, శ్రీకాంత్ మునగళ్ల, నగేష్ సూరపనేని, రంగ, రామకృష్ణ కాసర్ల, నవీన్, మహేష్ తన్నీరు. రామ్ ఉప్పాల, కృష్ణా కాట్రగడ్డ, నవీన్ లింగమనేని, చౌదరి నెక్కంటి, వేణు అబ్బూరి, అనిల్ రుమాళ్ల ఇలా చాలా మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఈ టోర్నమెంట్ విజయానికి తోడ్పాడ్డారని నాట్స్ వారిని ప్రత్యేక అభినందించింది.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;