RELATED NEWS
NEWS
ఇండియాలో పొలియో బాధితులకు అండగా నాట్స్

 

 

 

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ సేవాపథంలో మరో ముందడుగు వేయబోతోంది.. జన్మభూమి రుణం కొంత తీర్చుకోవడానికి తపించే నాట్స్ భారతదేశంలో పోలీయో బాధితులకు అండగా ఉండాలని నిర్ణయించింది.. లాస్ ఏంజిల్స్ లోని ఇర్విన్ హిల్టన్ లో సమావేశమైన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్, నాట్స్ కార్యవర్గం సభ్యులు పోలియో బాధితులను ఆదుకునేందుకు విజయవాడ రోటరీ క్లబ్ తో కలిసి పనిచేయాలని తీర్మానించారు. పోలీయో బారిన పడి వికలాంగులుగా మారిన వారికి వీల్ ఛైర్స్, వారికి ఉపయోగపడే పరికరాలు, శస్త్రచికిత్సలు అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించాలని నాట్స్ సంకల్పించింది.

 

పోలీయో వికలాంగులకు అండగా నిలబడాలనే సమున్నత ఆశయ సాధన కోసం నాట్స్ పని చేయబోతోందని నాట్స్ అధ్యక్షుడు గంగాధర్ దేసు తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ సత్కార్యాన్ని దిగ్విజయంగా చేసేందుకు నాట్స్ సన్నద్దమైందని ఆయన చెప్పుకొచ్చారు. పోలీయో బాధితులను ఆదుకోవాలనే మంచి ప్రతిపాదనకు నాట్స్ టీం ఈ సమావేశంలో ఆమోదం తెలిపింది.

 



నూతన బోర్డు అఫ్ డైరెక్టర్స్ ( 2014 - 2015) చైర్మన్ గా మధు కొర్రపాటి, డిప్యూటీ చైర్మన్ గా మూర్తి బాడిగ , జనరల్ సెక్రటరీ గా శ్రీధర్ అప్పసాని లను నాట్స్ ప్రకటించింది.



సమాజం మనకు ఏం చేసిందనేది కాదు .. సమాజానికి మనం ఏం చేశామనే కోణంలో నాట్స్ ఎప్పుడూ ఆలోచిస్తుందని..  దానికి తగ్గట్టు అడుగులు  వేస్తుందని నాట్స్  బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ఛైర్మన్ మధుకొర్రపాటి అన్నారు..  నాట్స్ హెల్ప్ లైన్ , ఉచిత వైద్యశిబిరాలతో నాట్స్ ఇప్పటికే అమెరికాలో తెలుగువారికి మరింత చేరువైందని.. ఇక ముందు నాట్స్ తన సేవలను మరింత  విసృత్తం చేయనుందని ఆయన తెలిపారు. నాట్స్ కార్యవర్గం చేపట్టే ప్రతీ కార్యక్రమానికి బోర్డు ఆఫ్ డైరక్టర్ల మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు. నాట్స్ టీం లో ఎవరు ఏ కొత్త ఆలోచనతో ముందుకొచ్చినా వారిని పోత్సాహించి.. దానికి కావాల్సిన సహకారాన్ని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ అందిస్తారని  మధు కొర్ర పాటి భరోసా ఇచ్చారు..



లాస్ ఏంజిల్స్ లో  2015  నాట్స్ సంబరాలు అంబరాన్నంటేలా.. నిర్వహించేందుకు ఇప్పటి నుంచే జరుగుతున్న ఏర్పాట్లను బోర్డ్ ఆఫ్ డైరక్టర్లలో ఒకరైన వీరయ్య చుండు వివరించారు. అంతకంటే ముందు మార్చి నెలలో మహిళా సంబరాలను నిర్వహించబోతున్నట్టు ఈ సమావేశంలో ప్రకటించారు. లాస్ ఏంజిల్స్ నాట్స్ టీం ఆధ్వర్యంలో.. ఎన్నో సరికొత్త కార్యక్రమాలతో ఈ  మహిళా సంబరాలు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే కోర్ కమిటీ.. మహిళా వాలంటీర్లను కూడా దీని కోసం నియమించుకుందని వీరయ్య చుండు వివరించారు.


 
ఇక, ఈ సమావేశం లోనే లాస్ ఏంజిల్స్ కు చెందిన తెలుగు ప్రముఖుడు డాక్టర్ రవి ఆలపాటి, చక్రధర్ ఓలేటి, పీపుల్ టెక్  గ్రూప్  ఛైర్మన్  టీజీ. విశ్వ ప్రసాద్ లను నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ గా తీసుకోవడం జరిగింది.ఇక ఈ సమావేశంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ రవి మాదాల, డాక్టర్ మూర్తి బాడిగ, డాక్టర్ శేఖర్ కొత్త, డాక్టర్ బుచ్చయ్య కొండ్రగుంట, శ్రీనివాస్ మద్దాలి, రవి అచంట లతో పాటు నాట్స్ బోర్డు సభ్యులు, కార్యవర్గ సభ్యులు..నాట్స్ ఛాపర్ల సమన్వయ కర్తలు పాలుపంచుకున్నారు.



ఈ సమావేశం అనంతరం చక్కటి తెలుగింటి విందును నాట్స్ లాస్ ఏంజిల్స్ టీం ఏర్పాటు చేసింది. దాదాపు 100 మందికి పైగా వాలంటీర్లు ఈ విందులో పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం అంగరంగ వైభవంగా నాట్స్ తెలుగు సంబరాలను విజయవంతం చేసేందుకు నాట్స్ లాస్ ఏంజిల్స్ టీం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుందనేది ఈ తాజా సమావేశంతో మరింత స్పష్టమైంది.

TeluguOne For Your Business
About TeluguOne
;