RELATED NEWS
NEWS
బేబీ హర్షిత వైద్యానికి నాట్స్ ద్వారా 50 వేల డాలర్ల సాయం

రండి.. మానవత్వంతో స్పందించండి.. అంటూ.. అమెరికాలోని నార్త్ అమెరికా తెలుగు సోసైటీ (నాట్స్) ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభించింది. తెలుగువారు ఆపదలో ఉంటే ఆదుకునేందుకు ఎన్నో చేతులు ముందుకు వచ్చాయి. క్యాన్సర్ తో పోరాడతున్న బేబి హర్షిత వైద్య సాయానికి మేము సైతం అంటూ చాలా మంది దాతలు తమకు తోచిన స్థాయిలో విరాళాలు అందించారు. ఇప్పటివరకు నాట్స్ హెల్ఫ్ లైన్ ద్వారా $50,490.00 డాలర్ల ఆర్థిక సాయం అందింది. గత వారం విరాళాల సేకరణతో వచ్చిన $30,000.00 డాలర్లను అందించిన నాట్స్ హెల్ఫ్ లైన్ ఈ వారం మరో $20,490.00 డాలర్లను చెక్కు రూపంలో బేబి హర్షిత కుటుంబానికి అందించింది. మానవత్వంతో స్పందించే మనసులు, మనుషుల వల్లే నాట్స్ హెల్ఫ్ లైన్ కు ఇది సాధ్యమైంది. నాట్స్ డైరక్టర్ డా.నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తో పాటు నాట్స్ ప్రతినిధులు శ్రీనివాస్ రాళ్లబండి, కిరణ్ కొడాలి, జాఫర్ మిర్జా, జయప్రకాష్ కొత్తా, కిషోర్ తిరుమలశెట్టి, శ్రీనివాస్ మేకా, మురళీధర్ రెడ్డివారి, చక్రధర్ ఓలేటిలు బేబి హర్షిత కుటుంబానికి సాయం అందించడంతో తమ వంతు ప్రయత్నం చేశారు. తెలుగువారికి అండగా ఉండేందుకు నాట్స్ ఎప్పుడు ముందుంటుంది.

baby harshitha, childhood cancer leukemia, nats harshitha, help 50 thousand dallors

 

నాట్స్ ఇటీవల చేపట్టిన మరిన్ని వివరాలకు www.natsworld.org సంప్రదించవచ్చు.

 

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;