RELATED NEWS
NEWS
NATS Mourns Sudden Death of Ravinder Reddy Kakulavaram

అట్లాంటా : మన మధ్యే ఉంటూ.. మనతో అనుబంధం ఉన్న ఆత్మీయులు, స్నేహితులు కోల్పోతే.. నిజంగా ఆ బాధ మాటల్లో చెప్పలేం.. అట్లాంటాలోని మన మిత్రుడు రవీందర్ రెడ్డి కాకులవరం మన మధ్య లేరనే విషయం తెలిసి నాట్స్ ఎంతో చింతిస్తోంది..  సాయి మురళీ రెస్టారెంట్ మేనేజర్ గా పనిచేసిన రవీందర్ రెడ్డి అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ.. అందరి మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. "కవరా" అనే కలం పేరుతో కూడా తన రచన చాతుర్యాన్ని చూపెట్టి.. తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. కానీ ఆ దేవుడు ఆయనను తీసుకెళ్లిపోయారు.

తీవ్రమైన గుండెనొప్పితో రావడంతో 48 ఏళ్ల వయసులో ఆయన ఈ లోకాన్ని విడిచారు. భార్య, పదకొండేళ్ల కొడుకుతో సంసారాన్ని నెట్టుకొచ్చే రవీందర్ రెడ్డి హఠత్తుగా మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటే.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చడంతో పాటు.. అండగా నిలుస్తుందని హమీ ఇస్తోంది.. ..రవీందర్ రెడ్డి పార్థీవ దేహాన్ని దర్శనార్థం ఎయిర్ పోర్ట్ మార్చురి వద్ద దర్శనార్థం ఉంచుతున్నారు. పార్థీవ దేహాన్ని ఇండియాకు  తరలించడానికి నాట్స్ తో పాటు స్థానిక తెలుగు సంఘాలు, సంస్థలు  తమ వంతు సాయం అందిస్తున్నాయి.

నాట్స్ ఆధ్వర్యంలో సంతాప సభ
మన రవీందర్ ను స్మరించుకుంటూ.. ఆయనతో ఉన్న అనుబంధాల్ని గుర్తు చేసుకుంటూ..ఓ సంతాప సమావేశాన్ని నాట్స్ ఏర్పాటు చేసింది  రవీందర్ రెడ్డి మరణ వార్త తెలియగానే నాట్స్ హెల్ఫ్ లైన్ వెంటనే స్పందించింది. రవీందర్ రెడ్డి కుటుంబానికి సంతాపం తెలియజేయడంతో నాట్స్ హెల్ఫ్ లైన్ రంగంలోకి దిగింది. నాట్స్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు, ప్రతినిధులు సునీల్ షవేలే, దేవానంద్ కొండూర్ లు రవీందర్ కుటుంబానికి సాయం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు  మానవత్వంతో ప్రవాసాంద్రులు స్పందించాలని నాట్స్ పిలుపునిచ్చింది. విరాళాలను అందించాలనుకున్న దాతలు https://www.natsworld.org/donate.php?cid=1 లో పూర్తి వివరాలు పొందవచ్చని తెలిపింది.

TeluguOne For Your Business
About TeluguOne
;