RELATED NEWS
NEWS
NATS డెట్రాయిట్ విద్యా సెమినార్

 

స్థానిక నోవై సివిక్ సెంటర్ సిటీ హాలులో నార్త్ అమెరికన్ తెలుగు సొసైటి (NATS), డిట్రాయిట్ ఆధ్వర్యంలో Educational Seminar చాలాఆహ్లాదకరమైన వాతవరణంలో అద్భుతంగా జరిగింది. పిల్లలు, పెద్దలు విశేషంగా హాజరయ్యిన ఈ సదస్సులో ఉత్తర అమెరికాలోనేప్రతిష్టాత్మక యూనివర్శిటీ, కాలేజీ లలో చదువుతున్న అనేక మంది ప్రతిభావంతులయిన విధ్యార్దులు మాట్లాడుతూ ఎన్నో విషయాలను వివరించారు. ఈ కార్యక్రమానికి శ్రీని కొడాలి గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

 

ప్రముఖ వైద్యులు రాఘవేంద్ర చౌదరి,  విజయ కిరణ్ కాజా గారు మాట్లాడుతూ  చదువుతో పాటు మంచి నడవడిక కూడా ఎంతముఖ్యమో వివరించారు, అలాగే పిల్లలకు  బాలవిహార్ లాంటివి ఎలా ఉపయోగపడతాయో చెప్పారు. శ్రీ శాం బొల్లినేని గారు తమ పిల్లలకి ఐవీ లీగ్ కాలేజీలలో సీటు రావడానికి వాళ్ళు, వాళ్ళతో పాటు తల్లి తండ్రులుగా తాము చేసిన కృషిని వివరించారు. శ్రీ భాస్కర్ వారణాసి మాట్లాడుతూ నార్త్ సౌత్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో పిల్లలకి ఉపయోగపడే ప్రోగ్రామ్స్ గురుంచి వివరించారు.  శ్రీ వెంకట్ మారంరాజు గారు, శ్రీ సాంబశివరావు గోగినేని గారు మాట్లాడుతూ ఆధునిక విజ్ఞానం అందరికీ అందుబాటులోకి తెచ్చిన  ఎలక్ట్రానిక్స్, టెలివిజన్, సోషల్ నెట్వర్కింగ్ ఈ కాలం పిల్ లలకి చదువు పైన వుండే ఏకాగ్రత ని ఎలా  సవాలు చేస్తోందో  తల్లితండ్రులు తమ పిల్లలకి తామే గురువులుగా ఎక్కువ సమయం వెచ్చిస్తే బాగుంటుంది అని చెప్పారు, అలాగే కాలేజీకి  అయ్యే ఖర్చు ఎలా సమకూర్చుకోవాలో వివరించారు.

ఈ సదస్సులో ప్రసంగించిన అత్యంత ప్రజ్ఞావంతులైన విద్యార్ ధులు శుశాంత్ బోడ (కాన్సాస్ మెడికల్ కాలేజీ), వికాస్ కొడాలి (జాన్ హొప్కిన్స్ యూనివర్శిటీ, మేరీల్యాండ్ ), ఏలీ లియాంగ్ ( వేల్లెస్లీ కాలే జీ, బోస్టన్), రాహుల్ కొడాలి (ఇండియానా యూని వర్సిటీ ),కార్తీక్ మునుగాల (యూనివర్సిటీ అఫ్ మిచి గాన్), వంశి అట్లూరి (వేన్  స్టేట్ యు నివర్సిటీ), రోహిత్ బొల్లినేని(సెయింట్లూఇస్ యూనివర్సిటీ) తమ ప్లానింగ్, రీడింగ్ habbits, పాల్గొన్న వాలంటీర్ కార్యక్రమాల వివరాలు, AP క్లాస్ సేస్ తీసుకోవటంలో మెళకువలు,

ACT /SAT టెస్టులకి ఎలా ప్రిపే ర్ అవ్వాలో ఇలా ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తాము చేసిన ఒప్పులు, పొరపాట్లు కూడావివరంగా చెప్పారు. (గారేజి తలుపు శబ్దం వినపడేదాక, టీవీ చూస్తూ, ఆ శబ్దం వినపడగానే ఎలా టీవీ కట్టేసి పుస్తకం తెరిచేవాళ్ళో లాంటిరహస్యాలతో సహా).. ఇవే కాక ఇంకా అనేక విషయాలు తెలుసుకున్నామని ఈ సదస్సు తమ భవిష్యత్తు ప్రణాళికలకు, తాము కోరుకున్న కాలేజీలలో ప్రవేశంపొందాలంటే ఎలా తయారు కావాలి అన్న విషయాలపై ఒక మంచి అవగాహన వచ్చిందని హాజరయిన విద్యార్థులు తెలియజేశారు.

ఇంతకు ముందు ఆరోగ్యానికి సంబంధించిన సదస్సు, మళ్ళీ ఇపుడు విద్యకు సంబంధించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినందుకు నాట్స్ డిట్రాయిట్ వారికి, హాజరయిన వారంతా ముక్త కంఠంతో ధన్యవాదాలు తెలియజేశారు.

father's  డే సందర్భంగా ఒక కేకు ని చిన్నపిల్లలతో కట్ చేయించటం జరిగింది.ఈ కార్యక్రమంలో ద్వారకా ప్రసాద్, కల్పనా సత్రసాల, శ్రీధర్ అట్లూరి, ప్రసాద్ కడియాల, ముత్యాల రావు నూతక్కి, వెంకట్ పాల, జగదీశ్ బోడపాటి, రవి నూతలపాటి, కిశోరే తమ్మినీడి, వేణుగోపాల్ సూరపరాజు, ప్రశాంత్ రెడ్డి, రామ్ పుతుంబాక, dr. శ్రీనివాస కొడాలి తదితరులు హాజరయ్యారు. పసందయిన అల్పాహారాన్ని ప్రియా రెస్టారెంటు వారు ఏర్పాటు చేశారు.

సభకి హాజరయిన వారందరికీ, అతితక్కువ వ్యవదిలోనే సమర్ధవంతంగా నిర్వహించటానికి ప్రధాన కారణమయిన శ్రీ కృష్ణ క్రోతపల్లి, దత్త సిరిగిరి, శివ అడుసుమిల్లి, వంశిధర్ రెడ్డి  వినుకొండ, వెంకట్ కొడాలి, గౌతం మార్నేని, సురేష్ రెడ్డి ద ారెడ్డి,కృష్ణమోహన్ నిచ్చనమెట్ల లను కార్యక్రమ రూపశిల్పి బసవేంద్ర సూరపనేని అభినందించారు తెలుగు వారికిఉపయోగపడే ఓ చక్కని సదస్సుని ని ర్వహించాలనే ఆలోచనని ఆచరణ లోకి  తీసుకొనిరావడానికి తనకు నాట్స్ అధ్యక్షుడు రవి మాదాల   ఎన్నో అమూల్యమైన సల హాలు ఇచ్చి ముందుకు నడిపించారని  సూరపనేని తెలిపారు.
 

కార్యక్రమాన్ని sponsor చేసిన HCL Global Systems, Farmington Hills, MI వారికి ప్రత్యేకాభినందనలు తెలియజేశారు.

TeluguOne For Your Business
About TeluguOne
;