RELATED NEWS
NEWS
అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ భారీ సన్నాహాలు

అమెరికా తెలుగు సంబరాలకు నాట్స్ భారీ సన్నాహాలు సంబరాలకు మేముసైతమంటూ ముందుకొస్తున్న స్థానిక తెలుగు సంఘాలు

నాట్స్ సంబరాలు-2015 ముహూర్తం దగ్గరకొస్తోంది. రెండేళ్లకు ఒకసారి జరిగే వేడుకలను గతం కంటే ఘనంగా జరపాలనే ఉత్పాహంతో అవిశ్రాంతంగా ఏర్పాట్ల పనులలో నాట్స్ సభ్యులు నిమగ్నమయ్యారు.లాస్ ఏంజెలెస్ లోని అనహైం కన్వెన్షన్ సెంటర్ లో ముస్తాబు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.  జూలై రెండు నుంచి జులై నాలుగో తేదీ వరకు జరిగే నాట్స్ ఉత్సవాల్లో ఏ రోజు ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నది  ఖరారైంది.



 

నాట్స్ బ్రాండ్ అంబాసిడర్ గజల్ శ్రీనివాస్ ను కలిసిన నాట్స్ సంబరాలు కార్యనిర్వాహకుల బృందం.సంబరాలకు ఆహ్వానిస్తూ గజల్ చేసిన వీడియోను విడుదల చేశారు. నాట్స్ సంబరాల కోసం రిజస్టర్ చేసుకోవాలని గజల్ శ్రీనివాస్ వీడియో ద్వారా తెలుగు వారిని కోరారు.

ఈ కాన్ఫరెన్స్ లో పాలుపంచుకోవాలనుకునే వారు సంబరాలు.ఓఆర్ జీ (http://www.sambaralu.org/) వెబ్ సైట్ ద్వారా ప్రపంచంలోని తెలుగువారంతా రిజిస్టర్ చేసుకోవచ్చని నాట్స్ తెలిపింది. నాట్స్ సంబరాలను విజయవంతం చేయడానికికష్టపడుతున్న నాట్స్ స్వచ్ఛంద బృందాలకు నాట్స్ మేనేజ్ మెంట్, సంబరాలు కార్యనిర్వాహక బృందంకృతజ్నతలు తెలిపింది. నాట్స్ సంబరాల ఏర్పాట్లపై ఎప్పటికప్పటి సమాచారాన్ని తెలుగువారందరికీ అందించడానికి నాట్స్ కార్యనిర్వాహక బృందం డైరెక్టర్లు రవి ఆలపాటి, వెంకట్ ఆలపాటి, ప్రసాద్ పాపుదేశి, చందు నంగినేని, మధు బోడపాటి, కిషోర్ గరికపాటి, వంశీ గరికపాటి, గిరి కల్లూరి, రామ్ యలమంచిలి, కృష్ణ మల్లిన, శ్రీహరి కొంక, మురళీ రెడ్డి తో కూడిన బృందం ప్రయత్నిస్తోంది.




నాట్స్ వాలంటీర్ మీట్ & బే ఏరియా మీట్

లాస్ ఏంజెల్స్, కాలిఫోర్నియాలో ఆల్ వాలంటీర్ మీట్ ను నిర్వహించించింది నాట్స్ సంబరాలు బృందం. ఈ సమావేశానికి దక్షిణ కాలిఫోర్నియా నుంచి 400 మంది హాజరయ్యారు.ముఖ్యంగా సిలికాన్ ఆంధ్రా టీమ్, నాట్స్ నేషనల్ లీడర్ షిప్ టీమ్ తో పాటు దక్షిణ కాలిఫోర్నియాలోని మరికొన్ని టీమ్ లు ఈ ఈవెంట్ లో పాల్గొన్నాయి.




'మీట్ అండ్ గ్రీట్ విత్ నాట్స్ ఈవెంట్' ను మిల్పిటాస్ లో నిర్వహించేదుకు వెళ్లిన నాట్స్ సంబరాలు కార్యనిర్వాహక బృందానికి బే ఏరియాలో  350 మందికి పైగా తెలుగు వారు ఘన స్వాగతం పలికారు. శ్యామ్ జాగర్లమూడి, శ్రీనివాస్ కొమ్మినేని ఆధ్వర్యంలోని ఈ ఈవెంట్ విజయవంతమైంది. నాట్స్ సంబరాలు-2015ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కాన్ఫరెన్స్ ఛైర్మన్  రవి ఆలపాటి బే ఏరియా తెలుగు ప్రజలను కోరారు.  కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటో కు వెళ్లిన నాట్స్  బృందానికి అక్కడ కూడా ఘన స్వాగతం లభించింది. నాట్స్ సంబరాలు-2015 కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామంటూ శాక్రమెంటో ఏరియాలోని తెలుగు సంఘాలు మద్దతిచ్చాయి. అలాగే ఇక్కడి నుంచి నాట్స్ సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చే వారి కోసం భారీ రవాణా ఏర్పాట్లు చేయబోతున్నట్టు స్థానిక తెలుగు సంఘాలు భరోసా ఇచ్చాయి. వేయి మైళ్ల యాత్రను ముగిస్తున్న సందర్భంగా డాక్టర్ రవి ఆలపాటి, వెంకట్ ఆలపాటి, చందు నంగినేని, మధు బోడపాటి, కిషోర్ గరికపాటి, గిరి కల్లూరి, కృష్ణ మల్లిన, అనిత కొంక, శ్రీహరి కొంక, లాస్ ఏంజెల్స్  బే ఏరియా ప్రాంతంలో  తెలుగువారందరికీ కృతజ్నతలు తెలిపారు. బే ఏరియాలో జరిగిన ఈ ఈవెంట్ ను విజయవంతం చేసిన శ్యామ్ జాగర్లమూడి, శ్రీనివాస్ కొమ్మినేనికి ప్రత్యేక కృతజ్నతలు తెలిపారు.


TeluguOne For Your Business
About TeluguOne
;