RELATED NEWS
NEWS
ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవాలని నాట్స్ పిలుపు

రండి..మానవత్వంతో స్పందిద్దాం..

ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకుందాం..

ప్రవాస భారతీయులకు నాట్స్ - గ్లోబల్ హిందు హరిటేజ్ ఫౌండేషన్ పిలుపు

 

 

 

 ఎన్నడూ కనీవినీ  ఎరుగని విపత్తు ఇది... ఉత్తరాఖండ్ లో జల ప్రళయం వెయ్యి మందినిపైగా పొట్టనబెట్టుకుంది. బద్రీనాథ్, కేదారీనాథ్ లకు దారులు కొట్టుకుపోయాయి. వంతెనలు కూలిపోయాయి. కేదార్ నాథ్  శవాల గుట్టగా మారిపోయింది.. కొండల మీద నుంచి ప్రవాహించిన గంగ  వేలమంది ప్రాణాలను తనలో కలిపేసుకుంది. ఇంకా కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాల్లో వేల మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు.  ఇంతటి విపత్కర పరిస్థితుల్లో  వరద బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత  ప్రతీ ఒక్క భారతీయుడిపైన ఉంది.  అందుకే అమెరికాలో గ్లోబల్  హిందూ హెరిటేజ్ ఫౌండేషన్.. వరదబాధితులను ఆదుకునేందుకు నేనుసైతమంటూ ముందుకొచ్చింది. ఈ  సత్కార్యంలో  ప్రవాసభారతీయులందరూ  భాగస్వాములు కావాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) పిలుపునిస్తోంది. మానవత్వంతో స్పందించి... వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు  మనవంతు సాయం అందించేందుకు విరాళాలు అందించాలని కోరుతోంది.  గ్లోబల్ హిందు హరిటేజ్ ఫౌండేషన్ కు వచ్చే విరాళాలు.. విశ్వ హిందు పరిషత్ వీహెచ్ పీ ద్వారా బాధితులకు అందచేస్తారు.


సహాయ కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు.. ఎవరు చేయగలిగినంత సాయం వారు చేసి.. సాటి భారతీయులను ఆదుకోవాలని జీహెచ్ హెచ్ ఫౌండేషన్ అకాంక్షిస్తోంది. మీరిచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది.. మీ విరాళాలను
VHP of America P.O. Box 441505, Houston, TX 77244-1505 అడ్రస్ కి చెక్ రూపంలో పంపవచ్చు.

 

క్రెడిట్ కార్డుతో విరాళాలు ఇచ్చేందుకు ఈ కింద లింక్ క్లిక్ చేయండి..

http://ess.vhp-america.org/dms/contribute.php?dicds=37

నాట్స్ హెల్ప్ లైన్  ద్వారా కూడా విరాళాలు పంపదలచినవారు ఈ కింద లింక్ క్లిక్ చేసి "భారతదేశ వరద సహాయ విపత్తు నిధి" అనే క్లాజ్ ద్వారా పంపండి.

https://www.natsworld.org/donate.php?cid=1

లేదా మీ చెక్కు ను "NATS' పేర వ్రాసి ఈ క్రింది అడ్రస్ కు మెయిల్ చేయవచ్చు Or

207 Skyline Dr

Keene, NH 03431

అన్ని విరాళాలకు పన్ను ,మినహాయింపు.  నాట్స్ కు , ఇంటర్నల్ రెవిన్యూ కోడ్ సెక్షన్ 501 (సి) (3) కింద ఫెడరల్ ఆదాయ పన్ను నుండి మినహాయింపు ఉంది.

TeluguOne For Your Business
About TeluguOne
;