RELATED NEWS
NEWS
NATS Immigration and Financial Seminars in New Jersey became a grand success

 

ఉత్తర అమెరికా తెలుగు సంఘం-నాట్స్ ప్రవాస భారతీయుల కోసం ఉచితంగా ఇమ్మిగ్రేషన్ సెమినార్, ఫైనాన్షియల్ ప్లానింగ్ సెషన్స్ నిర్వహించింది. న్యూజెర్సీలోని జెర్సీ సిటీ బావర్చి రెస్టారెంట్ బాంకెట్ హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది.

నాట్స్ నిర్వహించిన సెషన్స్ కు తెలుగువారి నుంచి అనూహ్య స్పందన లభించింది. కాలానుగుణంగా మంచి కార్యక్రమాలు, అందరికీ ఉపయోగపడే ఈవెంట్స్ నిర్వహిస్తున్నందుకు వచ్చినవారంతా నాట్స్ సేవా కార్యక్రమాలను కొనియాడారు.

ప్రఖ్యాత ఇమ్మిగ్రేషన్ అటార్నీ శ్రీనివాస్ జొన్నగడ్డల F-1, H-1, H-4, L-1, గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ గురించి సవివరంగా వివరించారు. ఇమ్మిగ్రేషన్ విధానంలో ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పులను, రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పుచేర్పులు ఉండొచ్చన్న అంశాలపైనా చెప్పుకొచ్చారు. దాదాపు ఐదు గంటల పాటు నడిచిన ఈ సెషన్ లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్స్ టెన్షన్, H-1 EADs, I-485, H-1 B మార్పులు ఇంకా ఎన్నో రకాల ఇమ్మిగ్రేషన్ అంశాలపై అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్ జొన్నలగడ్డ సమాధానం ఇచ్చారు.

ఫైనాన్షియల్ అటార్నీ గిగియో నైనన్ సమక్షంలో ఆర్థిక ప్రణాళికపై సెషన్ నడిచింది. ట్రస్ట్, ఎస్టేట్ ప్లానింగ్, వీలునామా రాయడంలో గిగియో నైనన్ కు అనుభవం ఉంది. వీలునామా ఎలా రాయాలి, వ్యాపారం ఎలా ప్రారంభించాలి, ట్రస్ట్ లేదా ఎస్టేట్ ప్లానింగ్ ఎలా ఉండాలి ఇలా ఎన్నో అంశాలపై అడిగిన ప్రశ్నలకు చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చారు.

అమెరికాలో అత్యంత ధనవంతుడైన ఏషియన్ అమెరికన్ షలభ్ కుమార్ కూడా ఈ సెషన్స్ కు విచ్చేశారు. నాట్స్ నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలను కొనియాడుతూ 5వేల డాలర్లు విరాళంగా ఇచ్చారు.

కెరీర్ అసిస్టెంట్ విభాగాన్ని చూస్తున్న నాట్స్ నేషనల్ కో-ఆర్డినేటర్ రమేష్ నూతలపాటి ఈవెంట్ ను వ్యాఖ్యాత గా వ్యవహరించారు. నాట్స్ న్యూజెర్సీ కోఆర్డినేటర్ రంజిత్ చాగంటి ఈవెంట్ కు ముందు ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. నాట్స్ నిర్వహిస్తున్న 24 గంటల హెల్ప్ లైన్, అమెరికాలో నాట్స్ స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై శ్రీధర్ అప్పసాని, సెక్రటరీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మాట్లాడారు.

ఇమ్మిగ్రేషన్ అటార్నీ శ్రీనివాస్ జొన్నలగడ్డను నాట్స్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ అందరికీ పరిచయం చేశారు. తెలుగు కమ్యూనిటీకి శ్రీనివాస్ చేస్తున్న సేవలను కూడా వివరించారు. ఇక నాట్స్ మౌలిక సిద్ధాంతాలు, నాట్స్ ఆలోచనలు, నాట్స్ ఏ విధంగా తెలుగువారికి సేవలు అందిస్తోందన్న అంశాలపై నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గంగాధర్ దేశు మాట్లాడారు. ఆర్థిక సలహాదారు గిగియో నైనన్ ను నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ మద్దలి పరిచయం చేశారు. నాట్స్ సోషల్ మీడియా ఛైర్ పర్సన్ వంశీ వెనిగళ్ల పరిశీలనలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నడిచింది.

నాట్స్ మీడియా కోఆర్డినేటర్ మురళీ కృష్ణ మేడిచర్ల, నాట్స్ మెడికల్ క్యాంప్స్ విభాగాన్ని చూస్తున్న సూర్యం గండి, నాట్స్ స్పోర్ట్స్ విభాగాన్ని చూస్తున్న వాసు తుపాకుల కలిసి శ్రీనివాస్ జొన్నలగడ్డ, గిగియో నైనన్ ను సన్మానించారు.

నాట్స్ ఇమ్మిగ్రేషన్ ఛైర్ పర్సన్ ప్రసాద్ గుర్రం, చంద్రశేఖర్ కొణిదెల ఆహుతులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికావ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ సెమినార్స్ నిర్వహించడానికి నాట్స్ ప్లాన్ చేస్తోందంటూ ప్రకటించారు.

నాట్స్ నిర్వహించిన ఈవెంట్ ను జెర్సీ సిటీలోని బావర్చి బిర్యాని కార్నర్ రెస్టారెంట్ స్పాన్సర్ చేసింది. వచ్చిన వారందరికీ రుచికరమైన భోజనం వడ్డించింది. బావర్చి రెస్టారెంట్ మేనేజ్ మెంట్ తరపున మాట్లాడిన విష్ణు.. ఎటువంటి కార్యక్రమానికైనా కేటరింగ్, డోర్ డెలివరీ చేస్తామని, రెస్టారెంట్ లో అధునాతన సౌకర్యాలతో బాంకెట్ హాల్ కూడా నిర్మించామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో చేయబోయే సేవా కార్యక్రమాల కోసం ఎదురుచూస్తోంది.

TeluguOne For Your Business
About TeluguOne
;