RELATED NEWS
NEWS
అమెరికా అంతటా విస్తరిస్తున్న నాట్స్

కాలిఫోర్నియా - బే ఏరియా చాఫ్టర్ ప్రారంభం

 

 

 

అమెరికాలో తెలుగు జాతిని ఏకం చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన పరిధిని మరింత పెంచుకుంటుంది.. అంగ రంగ వైభవంగా నాట్స్ మూడవ అమెరికా తెలుగు సంబరాలను నిర్వహించిన నాట్స్ కు ఇప్పుడు ప్రవాసాంధ్రులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా కాలిఫోర్నియాలోని బే ఏరియాలో నాట్స్ తన కొత్త ఛాప్టర్ ప్రారంభించింది.. తెలుగువారు వేల సంఖ్యలో ఉన్న ఈ ప్రాంతంలో నాట్స్ లో చేరేందుకు వారెంతో ఉత్సాహం చూపించారు. సిలికానాంధ్ర కూడా కొత్త చాఫ్టర్ ప్రారంభాన్ని స్వాగతించింది. అమెరికాలో తెలుగువారిని ఏకం చేస్తున్న నాట్స్ ను అభినందించింది.

 


నాట్స్ ప్రెసిడెంట్ రవి మాదాల అమెరికాలో ఉండే తెలుగువారికి నాట్స్ తరపున చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. బేఏరియాలో తెలుగు వారి ఐక్యత కోసం పాటుపడుతున్న శ్యాం జాగర్లమూడిని ఆయన అభినందించారు. నాట్స్ బే ఏరియా చాఫ్టర్  ప్రారంభానికి శ్యాం జాగర్లమూడి  చేసిన ప్రయత్నాలను కూడా రవి మాదాల ప్రశంసించారు.సాంబయ్య జాగర్లమూడి , రాజశేఖర్ రావు జకేల్లేటి, సుమన్ రామాయణం,రఘు మల్లాది,రవి పంజా, హరి రెడ్డి, సతీష్ రావుల, విజయ్ గోపినీడు , దివ్య తంగెళ్ల, రూపేష్ గండుపల్లి, ప్రశాంత్ బానూరు, గిరిప్రసాద్ పచ్చమట్ల, ఫసి కుర్రం, శ్రీనివాస్ బాబు జాగర్లమూడి, రణధీర్ గులకంటి, స్వరూప్ లండ , వెంకట్ కోడూరి, వెంకట్ బొల్లినేని లతో ఏర్పడిన టీం ను రవి మాదాల అభినందించారు. బే ఏరియాలో  తెలుగువారి కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా  నాట్స్ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.

 

 ఉచిత వైద్యశిబిరాలకు నాట్స్ అండ

 భాషే రమ్యం.. సేవే గమ్యం నినాదంతో ముందుకెళ్లే నాట్స్... బే ఏరియాలో కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతోంది.  రఘు మల్లాది, రవి పంజాలు ఈ ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటుకు సమన్వయ కర్తలుగా వ్యవహారిస్తారని నాట్స్ తెలిపింది.

TeluguOne For Your Business
About TeluguOne
;