RELATED NEWS
NEWS
నాట్స్ బిజినెస్ సెమీనార్: పెట్టుబడులపై మాజీ ఐ.ఏ.ఎస్. గోపాలకృష్ణ‌

 

 

 

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్టుబడులకు అపారమైన అవకాశాలున్నాయని ప్రముఖ మాజీ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ‌ తెలిపారు. అమెరికాలోని డాలస్ లో జరిగిన నాట్స్ నిర్వహించిన బిజినెస్ సెమీనార్ కు ముఖ్య అతిధిగా విచ్చేశారు. నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ విజయ్ వెలమూరి ఈ సెమీనార్ ను ప్రారంభించారు.. గోపాలకృష్ణ‌ నిర్వహించిన పదవులు.. సాధించిన విజయాలను విజయ్ వెలమూరి గుర్తు చేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఏయే పరిశ్రమలు పెట్టవచ్చనే అంశాలపై గోపాలకృష్ణ‌ సెమీనార్ కు విచ్చేసిన వారికి స్పష్టమైన అవగాహన కల్పించారు. ఒక్కో రాష్ట్రంలో ఏయే ప్రత్యేకతలు ఉన్నాయి..? ఏ రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలకు ఢోకా ఉండదనే విషయాలను గోపాలకృష్ణ‌ వివరించారు.


తెలంగాణలో పుష్కలమైన అవకాశాలు


పది జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయిన గోపాలకృష్ణ‌ వివరించారు. ముఖ్యంగా ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టవచ్చని సూచించారు. తెలంగాణ జిల్లాల్లో ఖనిజసంపద పుష్కలంగా ఉందని..ఖనిజాధారిత పరిశ్రమలు పెట్టుకుంటే కూడా మంచి లాభాలు వస్తాయన్నారు. ముఖ్యంగా విద్యుత్ రంగంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని గోపాలకృష్ణ‌  చెప్పుకొచ్చారు. తెలంగాణలో విద్యుత్ లోటును అధిగమించేందుకు ప్రయివేట్ విద్యుత్ కంపెనీలను  ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందని.. వీటిలో ధర్మల్, సోలార్, విండ్ పవర్ లో  పెట్టుబడులు పెట్టవచ్చని గోపాలకృష్ణ‌  సూచించారు. ఇక తెలంగాణలో హైదరాబాద్ మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని.. కొత్త ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసే అవకాశముందని తెలిపారు. కాబట్టి  మౌలిక సదుపాయాల కల్పన రంగంలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చని గోపాలకృష్ణ‌ చెప్పారు..
 


ఆంధ్రప్రదేశ్ లో అరుదైన అవకాశాలు


ఆంధ్రప్రదేశ్ లో పెట్టుడులు పెట్టేందుకు ఇదే అరుదైన అవకాశమని గోపాలకృష్ణ‌ చెప్పుకొచ్చారు..ఏపీకి ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి పన్నుల రాయితీ వస్తుందని..ఇది కొత్త కంపెనీలకు వరంలాంటిదన్నారు. కేంద్రం పన్నుల్లో ముఖ్యంగా ఎక్సైజ్ డ్యూటీ 16 శాతం మినహాయింపు వల్ల.. ఆ మేరకు కంపెనీలు లాభపడినట్టేనని గోపాలకృష్ణ‌ చెప్పుకొచ్చారు.ఇక కొత్త కంపెనీలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు కూడా ఉండే అవకాశముందని ఇది కూడా అరుదైన అవకాశంలాంటిదే అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహముంటుందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా వీటికి ప్రత్యేక రాయితీలు ఇస్తుందన్నారు. ఏపీలో కూడా విద్యుత్ ప్రాజెక్ట్ల్ ల్లో పెట్టుబడులు పెరిగే అవకాశముంది. ఈ దిశగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆలోచించవచ్చన్నారు. ఇక ఐటీతో పాటు వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు ఏపీలో మంచి అవకాశాలున్నాయని తెలిపారు..గుజరాత్ తరహాలో ఏపీలో దాదాపు 1000 కిలోమీటర్లపైగా ఉన్న కోస్తా తీరాన్ని ఉపయోగించుకుని..  పోర్టుల అభివృద్ధికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీని వల్ల ఏపీలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పరిశ్రమల్లో పెట్టుబుడులు పెట్టవచ్చన్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;