RELATED NEWS
NEWS
తెలుగు వికిపీడియా అభివృద్ధికి నాట్స్ సంకల్పం

తెలుగుభాష కోసం నాట్స్ మరో ముందడుగు.. తెలుగు వికిపీడియా అభివృద్ధికి నాట్స్ సంకల్పం

 

భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదానికి అనుగుణగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, "తెలుగు భాష" పరిరక్షణకు మరో ముందడుగు వేసింది. తెలుగు వికీపీడియా ను అభివృద్ధి చేసేందుకు నాట్స్ సంకల్పించింది. 10 కోట్ల మంది మాట్లాడే మన తెలుగు భాష వికీపీడియా లో అప్ డేట్స్ లేక వెలవెలబోతోంది. దీనిని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ మన తెలుగు సమాచారాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు నిశ్చయించుకుంది. అమ్మభాష కోసం వేస్తున్న ఈ ముందడుగు తెలుగు వెలుగులు భావితరాలకు అందిస్తుంది. అంతర్జాజంలో కూడా తెలుగు కిరణాలను దేదీప్యమానం చేస్తుంది. ఇప్పటికే నాట్స్ తెలుగు యూనికోడ్ లో ఎన్టీఆర్ ఫాంట్, నాట్స్ ఫాంట్స్ ను రూపొందించి తెలుగుజాతికి అంకితమిచ్చింది. మన భాషను రమ్యంగా కంప్యూటర్ లో చూపించే ఈ ఫాంట్స్ కు తెలుగు సాంకేతిక ప్రేమికుల నుంచి మంచి స్పందన వచ్చింది.. తాజాగా తెలుగు వికీపీడియా అభివృద్ధికి నాట్స్ సంకల్పించింది. దీనిని ఓ నిర్విరామ యజ్ఞం లా నిర్వహించనుంది. ఈ యజ్ఞం లో భాగస్వాములు కాదలిచినవారు కూడా నాట్స్ ను సంప్రదించవచ్చు. అమ్మభాష కోసం నాట్స్ తో కలిసి పనిచేయవచ్చు. ఈ కింది మెయిల్ అడ్రస్ కు మీ విలువైన అభిప్రాయాలు.. సూచనలు కూడా మెయిల్ చేయవచ్చు. aksharadeepika@natsworld.org or info@natsworld.org

TeluguOne For Your Business
About TeluguOne
;