RELATED NEWS
NEWS
2014-15 కు గాను నాట్స్ చికాగో చాప్టర్ కొత్త కార్యవర్గం

2014-15 కు గాను నాట్స్ చికాగో చాప్టర్ కొత్త కార్యవర్గం....చికాగో చాప్టర్ కో.ఆర్డినేటర్ గా నాగేంద్ర వేగే

 

 

 

నాట్స్ చికాగో ఛాప్టర్ 2014-15 కార్యనిర్వాహక కమిటీ కోసం నాట్స్ చికాగో లో సమావేశమైంది.ఇల్లినాయీస్, బ్లూమింగ్డేల్ లైబ్రరీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో నాట్స్ తన చికాగో టీం ఎవరనే దానిపై స్పష్టత వచ్చింది. చికాగో లో ఇప్పటికే ఉన్న నాట్స్ టీం సాధించిన విజయాలపై నాట్స్ వైస్ ప్రెసిడెంట్ రవి అచంట అభినందనల వర్షం కురిపించారు. గతంలో నాట్స్ ఎలాంటి విజయాలు సాధించింది... ఇకముందు ఎలా తన ప్రస్థానాన్ని కొనసాగించనుందనేది ఆయన వివరించారు. చికాగోలో నాట్స్, సీటీఏ కలిసిఎన్నో చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని..వీటిలో నాట్స్ తో సీటీఏ కార్యనిర్వహక సభ్యులుచేస్తున్న కృషి కూడా మరువలేనిదని రవి అచంట అన్నారు. అటు నాట్స్ అధ్యక్షుడు గంగాధర్ దేసు కూడా చికాగో నాట్స్ టీం 2013లో చేసిన కార్యక్రమాలను..వాటిని నడిపించిన నాయకులను కొనియాడారు. ఆ తర్వాత నాట్స్ చికాగో ఛాప్టర్ కొత్త కార్యనిర్వహక కమిటీ ని ప్రకటించారు.


నాట్స్ చికాగో చాప్టర్ కో ఆర్డినేటర్ గా నాగేంద్ర వేగే కు బాధ్యతలు అప్పగించారు. కార్యదర్శిగా రమేష్ మర్యాల , కోశాధికారిగా వరప్రసాద్ బోడపాటి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి పదవులు రామకృష్ణ తూనుగుంట్లకు అప్పగించారు.


ఇక నాట్స్ చికాగో చాప్టర్ డైరక్టర్ పదవులు నవీన్ అడుసుమల్లి,మురళీ కలగర, వేణుకృష్ణద్రుల,పృద్వీ చలసాని, మహేష్ ఆళ్ల, అరవింద్ కోగంటి,  రాజేష్ వీదులముడి, మనోహార్ పాములపాటి, ప్రణయ్ రాజ్ కుమార్ పిండి, సందీప్ నన్నూరి, బిందు బాలినేని లను వరించాయి.


ఇక 2014-15 నాట్స్ చికాగో చాప్టర్  సలహామండలిలో రావు అచంట,  ప్రవీణ్ మోటూరు,శ్రీనివాస్ చుండు,అశోక్ పగడాల, డాక్టర్ పాల్ దేవరపల్లి, శ్రీనివాస్ బొప్పన్న, విజయ్ వెనిగళ్ల కు చోటు లభించింది.నాట్స్ చికాగో చాప్టర్ కన్వీనర్ తనకు అవకాశమిచ్చినందుకు నాగేంద్ర...  నాట్స్ నాయకత్వానికి ధన్యవాదాలుతెలిపారు. చికాగో నాట్స్ తరపున తెలుగువారికి తన శాయశక్తులా సేవలందించేందుకు  కృషి చేస్తానని చెప్పారు.  సీటీఏ, నాట్స్ తో ఉన్న అనుబంధాన్ని ఈ రెండు సంఘాల సభ్యులు ఈసమావేశంలో పాలుపంచుకున్నారు.

TeluguOne For Your Business
About TeluguOne
;