RELATED NEWS
NEWS
డాక్టర్. ఎపిజె అబ్దుల్ కలాంకు నాట్స్ నివాళి

షిల్లాంగ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం-S) లో భారత మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్. ఎపిజె అబ్దుల్ కలాం సోమవారం సాయంత్రం షుమారు 6:30 గం. లకు ఒక ఉపన్యాసం ఇస్తున్న సమయంలో కుప్ప కూలి పోయారు. వెంటనే బెథనీ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన కలాం, తమిళనాడు లోని రామేశ్వరం లో అక్టోబర్ 15, 1931 లో జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీ నుండి ఫిజిక్స్ మరియు అంతరిక్ష ఇంజనీరింగ్ లో పట్టా పొందారు.

అతను రామేశ్వరం, తమిళనాడు, భారతదేశం లో అక్టోబర్ 15, 1931 న ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి మద్రాస్ యూనివర్శిటీ ఫిజిక్స్ మరియు అంతరిక్ష ఇంజనీరింగ్ పట్టా జరిగినది.డాక్టర్. అబ్దుల్ కలాం,  రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) లలోశాస్త్రవేత్త మరియు నాలుగు దశాబ్దాలు విజ్ఞాన నిర్వాహకుడిగా భాద్యతలు నిర్వహించారు. భారతదేశం యొక్క పౌర అంతరిక్ష కార్యక్రమం మరియు సైనిక క్షిపణి అభివృద్ధి ప్రయత్నాలు వంటి కార్యక్రమాలలో చురుకుగాపాల్గొన్నారు. బాలిస్టిక్ క్షిపణి మరియు ప్రయోగ వాహనం టెక్నాలజీ అభివృద్ధి లో తలమునకలై పని చేసే కలాం ని  భారత 11 వ రాష్ట్రపతి గా ప్రమాణం చేసేంత వరకూ,  అందరూ 'మిస్సైల్ మాన్'  అంటుండేవారు.

జూలై 2002 నుండి జూలై 2007 వరకూ 5 సంవత్సరాలపాటు భారత రాష్ట్రపతి గా పదవీ భాత్యతలు నిర్వహించారు. ఆ సమయంలో అందరూ కలాం ను 'పీపుల్స్ ప్రెసిడెంట్' అనేవారు.  భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న 3 వ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం. అల్లాగే  రాష్ట్రపతి గా ప్రమాణం చేసిన మొదటి శాస్త్రవేత్త కూడా.

1997 లో భారత రత్న తో పాటు, శాస్త్రీయ పరిశోధన మరియు రక్షణ టెక్నాలజీ ఆధునికీకరణ లలో విశేష ప్రతిభ కనబరిచినందుకు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారాలనెన్నో పొందారు కలాం. కలాం 79 వ పుట్టినరోజున ఐక్యరాజ్యసమితి 'వరల్డ్ స్టూడెంట్ డే' గా గుర్తించింది.  ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్), డాక్టర్. ఎపిజె అబ్దుల్ కలాం ఆకస్మిక మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తోంది.

TeluguOne For Your Business
About TeluguOne
;