RELATED NEWS
NEWS
న్యూజేర్సీలో నాట్స్ టాక్స్ సెమీనార్

 

 

 

ఇక టాక్స్  సెమీనార్ లో పన్ను అంశాలపై ప్రెజెంటేషన్ ఇవ్వటానికి ప్రఖ్యాత ఆర్థిక నిపుణులు  శ్రీ ముకేష్ మహాజన్ ను నాట్స్ సభా వేదికపైకి స్వాగతించింది. టాక్స్ రిటర్న్స్  ఎలా చేయాలి. టాక్స్ సేవింగ్ కు ఎలాంటి చిట్కాలు పాటించాలి.. వ్యక్తిగత పన్ను విధానం,  వ్యాపార పన్నుల విధానం గురించి సమగ్రంగా ముకేష్ మహాజన్  వివరించారు.  ప్రముఖ  ఆర్థిక నిపుణులు  ఫారెస్ట్ హిల్ ఫైనాన్షియల్ గ్రూపుకు చెందిన  వి.ఎన్. గుప్తా, పంబన్ మేయన్ లు.. టాక్స్ గురించి ఎన్నో విలువైన సూచనలు, సలహాలు అందించారు.ఫ్లెక్సిబుల్ సేవింగ్ అకౌంట్, హెల్త్ సేవింగ్ అకౌంట్ల పై  వి. నాగేందర్ గుప్తా  సెమీనార్ కు విచ్చేసిన వారికి స్పష్టమైన అవగాహన కల్పించారు.  పిల్లల చదువు,  డబ్బు పొదుపు, పెట్టుబడి మార్గాలు,  పెట్టుబడులు పెట్టడంలో అనుసరించాల్సిన మార్గాలను కూడా ఆర్థిక నిపుణులు సూచించారు. జీవత బీమా, పదవి విరమణ  ప్రణాళికలపై కూడా ఎంతో సవివరంగా వక్తలు వివరించారు.
 

ఇక ఈ సదస్సుకు హజరైన చాలా మంది తమకున్న ఆర్థిక సందేహాలపై వేసిన ప్రశ్నలకు  కూడా ఆర్థిక నిపుణులు సమాధానమిచ్చారు. ట్యాక్స్ గురించి ఎన్నో కొత్త విషయాలతో పాటు....ట్యాక్స్ మినహాయింపులుపై ఆర్థిక నిపుణులు చెప్పిన విషయాలు తమకు ఎంతో ఉపకరిస్తాయని ఈ సదస్సుకు వచ్చిన పలువురు ప్రశంసించారు. నాట్స్ టాక్స్ సెమీనార్ కు మంచి స్పందన రావడంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని నాట్స్ ప్రతినిధులు తెలిపారు.

నాట్స్ ఉపాధ్యక్షులు మోహన కృష్ణ మన్నవ చొరవతో ఏర్పాటైన  ఈ టాక్స్ సెమీనార్ కు నాట్స్ టీం కొండంత అండగా నిలిచింది. నాట్స్ అధ్యక్షులు గంగాధర్ దేసు, నాట్స్ న్యూజేర్సీ సమన్వయ కర్త రంజిత్  చాగంటి, నాట్స్ నేషనల్ మీడియా కో ఆర్డినేటర్  మురళీకృష్ణ  మేడిచర్ల,  నాట్స్ జాతీయ క్రీడల అధ్యక్షుడు వాసు తుపాకుల, నాట్స్ జాతీయ సోషల్ మీడియా అధ్యక్షుడు శ్రీహరి మందాడి,  నాట్స్  నేషనల్ కెరీర్ కో ఛైర్మన్ విష్ణు ఆలూరు, నాట్స్ నేషనల్ ఇమ్మిగ్రేషన్ ఛైర్మన్ చంద్రశేఖర్ కొణిదెల,  నాట్స్  నేషనల్ ఇమ్మిగ్రేషన్ కో ఛైర్మన్  ప్రసాద్ గుర్రం, నాట్స్ న్యూ జేర్సీ మహిళల కమిటీ ఛైర్ పర్సన్  ఆశా వైకుంఠం, నాట్స్ న్యూజేర్సీ మహిళ కమిటీ కో ఛైర్ పర్సన్  రేఖ ఉప్పలూరి, నాట్స్ క్రియాశీలక  ప్రతినిధులు రామానాయుడు కంఠుభుక్త, నాట్స్ ప్రమోషన్ ఛైర్మన్ శ్యామ్ నాళం, శ్రీనివాస్ భరతవరపు, నాట్స్ న్యూ జేర్సీ స్పెషల్ ప్రాజెక్ట్స్ ఛైర్మన్ జై ప్రకాష్ గుత్తా,  నాట్స్ న్యూజేర్సీ కేరీర్, అండ్ హెల్ఫ్ కో ఛైర్మన్ వివేక్ కలగర, కో ఛైర్మన్  సుధీర్ తుమ్మల,  నాట్స్ న్యూజేర్సీ ఇమిగ్రేషన్ కో ఛైర్మన్ సుధీర్ తుమ్మల, న్యూజేర్సీ నాట్స్ వాలంటీర్స్ ఛైర్మన్ జ్యోతిష్ మామిళ్లపల్లి,  నాట్స్ న్యూ జేర్పీ మీడియా కో ఛైర్మన్  రవి బోగా లు ఈ కార్యక్రమం విజయవంతానికి ఎంతో శ్రమించారు.  

వీరితో నాట్స్ న్యూజేర్సీ టీం  వెంకటరావు ఓరుగంటి, లీలా కృష్ణ కంచికచర్ల , సుధీర్ పోటు , రాకేష్ బత్తుల , సోమ కలగర , సురేష్ గోరంట్ల , తులసిరామ్ కొడాలి , మోహన్ కునంనేని , కృష్ణ గోపాల్ నెక్కంటి , మధు దవడ , గోపాలరావు చంద్ర , వంశీ వెనిగళ్ల , శ్రీనివాస్ జంపని , రాంజీ సాధనాల, ప్రసాద్  ధామనలు టాక్స్ సెమీనార్  కోసం తమ వంతు కృషి చేశారు.

నాట్స్ CME కోఆర్డినేటర్ డా. గంటి సూర్యం, న్యూ జెర్సీ అసెంబ్లీ డిప్యుటీ స్పీకర్ చివుకుల ఉపేంద్ర ను సభకు పరిచయం చేసారు. ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు నాట్స్ ను  ఉపేంద్ర అభినందించారు.  ఇంకా  24 గంటల   ( 1-888-4-తెలుగు ) వంటి సహాయ లైన్ , ఉచిత క్లినిక్ ద్వారా ఉచిత ఆరోగ్య వైద్య సేవలు వంటి  కమ్యునిటీ సేవలను  ఏర్పాటు చేయటంలో నాట్స్ తొలి భారతీయ తెలుగు సంస్థ గా వుందని ప్రశంసించారు.

 దాము గాదెల, ప్రసాద్ కునిశెట్టి , రాంబాబు వైకుంఠం, మోహన్ భార్గవ వంటి అనేక మంది ప్రముఖులు  ఈ సెమీనార్ కు హాజరయ్యారు. అరుణ్ అయ్యగారి , రామ్ మిరియల , రమేష్ అక్కిశెట్టి , మోహన్ పుతుంబాక , బద్రీ .టీ, రాజేష్ కొమ్మినేని  , విజయ్ కృష్ణ తిరుంగురి, రాజీవన్ ఎర్రబోతుల , చైతన్య మంగరాయి , కృష్ణ గంజి , రాఘవేంద్ర వరకల , శశిధర్ ఈమని , విజయానంద్ కొత్తపల్లి , సోమశేఖర్ బడుగు , శ్రీనివాస్ నోముల , జయదేవ్ కోనేరు , శ్రీనివాసరెడ్డి , మల్లికార్జునరావు, కళ్యాణ్ రవిలు నాట్స్ టాక్స్ సెమీనార్ ఏర్పాటును ప్రశంసించారు.

 తెలుగు ఫైన్ ఆర్ట్స్ సోసైటీ  ఎగ్జిక్యూటివ్ కమిటీ  సభ్యులైన మంజు భార్గవ ,వసంత్ తన్నా , శ్రీనివాస్ గండి ,సుధాకర్ ఉప్పల , కనక తాటికొళ్ళ  కార్యక్రమంలో పాల్గొన్నారు, గ్రేటర్ డెలావేర్ తెలుగు అసోసియేషన్ (TAGDV ) ఎగ్జిక్యూటివ్ కమిటీ - హరినాథ్ బుంగతావుల, విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు . నాట్స్ ప్రతినిధులు TFAS మరియు TAGDV ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను సత్కరించారు.

నాట్స్ టాక్స్ సెమీనార్ ను విజయవంతం చేసినందుకు నాట్స్ కెరీర్ అసిస్టెన్స్ ఛైర్మన్ రమేష్ నూతలపాటి  కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ న్యూజేర్సీ టీం... నాట్స్ కొత్త అధ్యక్షుడు గంగాధర్ దేసు, ఉపాధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ లను ఘనంగా సత్కరించారు.  

TeluguOne For Your Business
About TeluguOne
;