‘వైకాపు’ల కలవరం.. కలకలం...

Publish Date:Mar 16, 2015

Advertisement

 

ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందని, తుంటిమీద కొడితే పళ్ళు రాలినట్టు అనే సామెతలు తెలిసినవే. ఇప్పుడు జగన్ పార్టీ వైకాపాలో అంతర్గత రాజకీయాలు ఈ సామెతకు తగ్గట్టుగా తయారయ్యాయి. ప్రస్తుతం పార్టీలో ఏర్పడిన పరిస్థితులు ఇంతకాలం పార్టీకి ‘కాపు’గాసిన వారికి పార్టీలో మనశ్శాంతిగా వుండలేని పరిస్థితులు తెచ్చిపెట్టాయి. సిట్యుయేషన్ ఇలా తయారవ్వడానికి ప్రధాన కారణం పార్టీలోని వ్యక్తులు కాదు.. అసలు వైసీపీకి ఎలాంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్. ఆశ్చర్యగా వుందా? నమ్మశక్యం కావడం లేదా? కానీ, ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్. వై‘కాపు’లలో కలవరం, కలకలం రేగడానికి పవన్ కళ్యాణ్ పరోక్షంగా కారణమయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే....

 

‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్‌కి జనాల్లో ఎంత క్రేజ్ వుందో, ఆయన సామాజికవర్గమైన కాపులలో కూడా అంత క్రేజ్ వుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాపు సామాజికవర్గం కొన్ని దశాబ్దాలుగా తమనుంచి సరైన నాయకుడు లేక చాలా వెలితిగా ఫీలవుతోంది. సంఖ్యాపరంగా రాష్ట్ర రాజకీయాలను శాశించే స్థితిలో వున్నప్పటికీ తమ నుంచి సరైన నాయకుడు రాలేదే అనే బాధ వీరికి వుంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పుడు ఆయన మీద ఆశలు పెట్టుకున్న వీరందరూ ఆయన జెండా పీకేసి కాంగ్రెస్‌లో చేరిపోవడంతో షాకయ్యారు. అయితే మొన్నీమధ్యే రాజకీయ రంగప్రవేశం చేసి ‘జనసేన’ పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ చుట్టూ వీళ్ళు తమ ఆశల పందిరిని అల్లుకుంటున్నారు. భవిష్యత్తులో తమ నుంచి ‘ముఖ్య’ నేతగా ఎదిగే వ్యక్తి పవన్ కళ్యాణ్‌ అని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య అటు తిరిగి, ఇటు తిరిగి వైసీపీలోని కాపులలో కలకలం రేగేలా చేసింది.

 

ఏపీ రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ మొన్నామధ్య పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో పదేళ్ళపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వుండాలని కోరుకుంటున్నానని అన్నారు. అంతే... ఈమాట డైరెక్టుగా వెళ్ళి వైసీపీ నాయకుడు జగన్‌ గుండెని తాకింది. అప్పటి వరకూ తమ పార్టీలోని సీనియర్ కాపు నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనుకుంటున్న జగన్ ఒక్కసారిగా మనసు మార్చుకున్నారు. ఆ పదవిని శెట్టిబలిజ నాయకుడు పిల్లి సుభాస్ చంద్రబోస్‌కి ఇవ్వాలని డిసైడ్ చేసేశారు. గోదావరి జిల్లాల్లో కాపులకు దీటుగా నిలిచే సామాజిక వర్గం శెట్టిబలిజ. తమ నాయకుడిని కాదని తమకు వ్యతిరేకంగా వుండే సామాజికవర్గం నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో వైసీపీలోని కాపు నాయకులందరూ లబోదిబో అంటున్నారు. వచ్చే ఎన్నికలలో కాపుల అండదండలతో తాను సీఎం అవ్వాలని ఓవైపు జగన్ భావిస్తుంటే, మరోవైపు కాపుల ఇష్టుడు పవన్ కళ్యాణ్ మాత్రం మరో పదేళ్ళపాటు చంద్రబాబే సీఎం అని అనడంతో జగన్ హర్టయ్యారట. ఏదో ఒక సమయంలో పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోయే కాపు నాయకులకు తాను ఎందుకు పదవులు ఇవ్వాలని అనుకున్నారట. అందుకే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకి మొండిచెయ్యి ఇచ్చారట. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అటు తిరిగి, ఇటు తిరిగి ఉమ్మారెడ్డి పదవికి ఎసరుపెట్టేసరికి వైసీపీలోని కాపు నాయకులు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో వున్నారట.

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.