జగన్ బ్యాక్ టు బెంగళూరు: వైసీపీలో కలకలం, కలవరం.!

Publish Date:Oct 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక   సమరం  వేడెక్కిన వేళ, వైసీపీ అధినేత జగన్ తీరు ఆ పార్టీ వర్గాల్లో కలకలానికీ, కలవరానికీ దారి తీస్తోంది.   రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక, పురపాలక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ, ప్రచారం ముమ్మరంగా సాగుతున్న క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయాల్సిన పార్టీ అధినేత.. ఆ బాధ్యతను గాలికొదిలేసి బెంగళూరు చెక్కేయడం పట్ల వైసీపీ క్యాడర్, లీడర్ లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. 

 ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం కూటమి అరాచకంగా వ్యవహరిస్తోందనీ, స్థానక సమరంలో తమ పార్టీ వారిని నామినేషన్లు కూడా దాఖలు చేయనీయకుండా దాడులకు పాల్పడుతోందనీ, ఆదివారం (అక్టోబర్ 18)న రాష్ట్రంలో రచ్చ రచ్చ చేసి, మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ గగ్గోలు పెట్టిన  జగన్, తెల్లవారేసరికి అంటే సోమవారం (అక్టోబర్ 19) బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లి పోయారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితినీ, క్యాడర్ ను అండగా నిలవాల్సిన బాధ్యతను గాలి కొదిలేసి.. ఆయన బెంగళూరు చెక్కేయడం పట్ల వైసీపీ క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది.  

స్థానికి పోరు వేళ.. క్షేత్రస్థాయిలో అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని   తీవ్ర ఆరోపణలు గుప్పించిన  జగన్… ఆ దాడులకు వ్యతిరేకంగా పార్టీ తరఫున నిరసనలకు నాయకత్వం వహించాల్సిన జగన్.. మీ చావు మీరు చావండి.. అధికార పార్టీ దాడుల్లో దెబ్బలు తినండి, ఆ తరువాత తీరిగ్గా వచ్చి పరామర్శిస్తా అంటూ బెంగళూరుకు మకాం మార్చేయడన్ని వైసీపీ నేతలు, శ్రేణులూ జీర్ణించుకోలేకపోతున్నారు.  

 క్షేత్రస్థాయిలో అధికార కూటమి నేతలు పూర్తి స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తుంటే, పార్టీ అధినాయకత్వం మాత్రం రాష్ట్రానికి దూరంగా ఉండటంపై పార్టీలో ఒక రకమైన నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ నింపింది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన  క్షణం నుంచీ ప్రతి సెకనూ   కీలకమైనదిగా భావిస్తారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి   స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది.

పలు స్థానాల్లో నామినేషన్ల దాఖలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలపై కూటమి నాయకులు శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, ఇదే సమయంలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు, అభ్యర్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తిప్పికొట్టేందుకు అధినేత అందుబాటులో ఉండి ధైర్యం చెప్పాలని, దిశా నిర్దేశం చేస్తారని సహజంగానే ఆశిస్తారు.

అయితే జగన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంతో పోటీకి ముందే వైసీపీ చేతులెత్తేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.  వైసీపీకి పట్టున్న కొన్ని కీలక నియోజకవర్గాల పరిధిలోని  స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి అభ్యర్థులెరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు జగన్ తీరు, వైఖరే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  


[YCP Handsup Local Body Elections, Andhra Pradesh Politics, Jagan,Bengaluru, Cadre Angry, Telugu One] 

By
en-us Political News

  
మేము మోచేతులు పైకి మడత పెట్టాం.. పులివెందుల సభలో జగన్‌పై విమర్శలు..!
తుపానును సమర్ధంగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులూ ఒడ్డామని చెప్పిన ఆయన అర్నాబ్ కారణంగా రాష్ట్రంలో ఐదుగురు మరణించారని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారిని కాపాడలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 సహాయ చర్యలలో   39 ఎన్‌డీఆర్‌ఎఫ్  బృందాలతో పాటు 80 రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన  బృందాలు నిమగ్నమై ఉన్నాయి. ఇవి కాకుండా . ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  ప్రత్యేకంగా రెండు విమాన సర్వీసులను నడిపి అదనపు బలగాలను క్షేత్రస్థాయిలో  మోహరించింది.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక నిర్ణయం తీసుకుంది.
అర్నాబ్ తుపాను కారణంగా భారీ వర్షాలు, ప్రచండ గాలుల కారణంగా అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను మరో ఏడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. అర్నాబ్ తుపాను తీరం దాటింది.. ఇక వానలు తగ్గుతాయి అనుకుంటున్న దశలో వాతావరణ శాఖ మరో వారం పాటు ఏపీకి భారీ వర్షాల బెదల కొనసాగుతుందని హెచ్చరించింది. 
అర్నాబ్   కాకినాడ జిల్లాలోని   ఉప్పాడలో బీభత్సం సృష్టించింది. సముద్ర రాకాసి అలలు బీచ్ రోడ్డును ధ్వంసం చేశాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సైతం కొట్టుకు పోయాయంటే అలల ఉధృతి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్ రైతుల పరిస్థితి.
ఆర్నాబ్ ప్రభావంతో రాష్ట్రంలో రవాణా వ్యవస్థ పరిస్థితి దయనీయంగా మారింది.  ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి.  ఇక ఇప్పుడు అర్పాబ్ ప్రభావం కారణంగా రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న సంఘటనలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.  అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులో తుపాను ధాటికి రైల్వే   ట్రాక్ ధ్వంసమైంది.
అర్నాబ్ తుపాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో జరిగి ఆస్తి నష్టం అంచనాకు సత్వరమే కేంద్ర బృందాన్ని పంపాలని ఆ లేఖలో చంద్రబాబు హోంమంత్రిని కోరారు.  అలాగే అర్నాబ్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చే విషయంలో కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు కోరారు.
రీ వర్షం కారణంగా బందరు వీధులు చెరువులను తలపించాయి.  లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.  ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టింది.   రహదారులపై పడిన చెట్లను, కొమ్మలను యంత్రాల సాయంతో తొలగించి దారులను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
నరసాపురం-యానాం మధ్య తీరం దాటిన ఈ అతి తీవ్ర తుపాను ప్రభావంతో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో భీకర ఈదురుగాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. తుపాను తీవ్రత కారణంగా కోనసీమ వ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
  అతి తీవ్ర తుపాను అర్నాబ్ కారణంగా ప్రాణనష్టం సంభవించకుండా రాష్ట్రం బయటపడగలిగిందంటే అందుకు చంద్రబాబు నిరంతరం చేసిన సమీక్షలు, అధికారులకు చేసిన దిశా నిర్దేశం, తుపాను నష్టాన్ని తగ్గించడానికి అమలు చేసిన కార్యాచరణే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.