బాబు, పవన్ లోకేష్ దసరా శుభాకాంక్షలు: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాక్ష.!

Publish Date:Oct 19, 2026

Advertisement

విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ గొప్ప స్ఫూర్తిని ఇస్తుందని పేర్కొన్న ఆయన  ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.  

రైతన్నల శ్రమకు తగిన ఫలితం, మహిళలకు సాధికారత, యువతకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు తమ ప్రభుత్వం చేస్తున్న సంకల్పానికి దుర్గమ్మతల్లి అనుగ్రహం లభించాలని ప్రార్థిస్తున్నట్లు  తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని   కోరుకుంటున్నట్లు చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.

అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.   చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలనీ,  దుర్గాదేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తమ సంప్రదాయాలకు అనుగుణంగా శక్తి స్వరూపిణిని ఆరాధిస్తూ దసరా ఉత్సవాలను వైభవోపేతంగా జరుపుకుంటున్నారని పేర్కొన్న పవన్ కల్యాణ్  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాకతో ఇంద్రకీలాద్రి ఉత్సవాలు మరింత శోభాయమానంగా జరిగాయి. విజయవాడ వేదికగా నిర్వహించిన జాతీయస్థాయి సరస్ మేళా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసిందన్నారు.  

కనకదుర్గమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పిస్తూ, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఈ విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.   ప్రజాకంటకుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించి, ధర్మాన్ని గెలిపించిన ఈ పవిత్రమైన రోజున అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ చేపట్టే పనుల్లో గొప్ప విజయాలు సాధించాలి" అని మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు.

[CBN Pawan Lokes Dasara wishes, Telugu People, Happy, Prosparus, Vijayadasami, Telugu One]

By
en-us Political News

  
ఎండల తీవ్రత, ఎల్ నినో ఎఫెక్ట్ తో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుతుండటంతో తిరుమలలో భక్తులకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం  అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా నీటి పొదుపు, సమర్థవంతమైన నీటి యాజమాన్య చర్యలను ప్రారంభించింది
మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసినట్లు అసెంబ్లీ వేదికగా వెల్లడించామనీ   ఆ హామీకి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి లోకేశ్  స్పష్టం చేశారు. చెల్లింపుల ప్రక్రియ సాగే కొద్దీ బడ్జెట్ అంచనాలు సవరించబడతాయని చెప్పారు.
హత్యాయత్నం  కేసుల్లో నిందితులుగా ఉన్న రౌడీ షీటర్లను పోలీసులు అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయన్న బీటెక్ రవి,  పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే అధికార పార్టీలో ఉన్నప్పటికీ తానే స్వయంగా డీఎస్పీ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
బనగానపల్లెలోని ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్న ఇందిరా రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు పలికారు.  
వాటి ద్వారా ఎంతమంది కార్మికులకు నిజమైన ఉపాధి లభిస్తోంది, మొబైల్ యాప్, నైపుణ్య శిక్షణ ఎలా అమలవుతాయనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేవలం వసతి కేంద్రంగానే కాకుండా సమర్థవంతమైన ఉపాధి వేదికగా లేబర్ అడ్డాలను నిలబెట్టడమే తమ లక్ష్య మని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించి  నవంబర్ 21న రిటర్నింగ్ అధికారులు ఫారమ్-1 ద్వారా నోటీసు జారీ చేసి, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి నవంబర్ 23వ తేదీ వరకు  అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.   నామినేషన్ల పరిశీలనను నవంబర్ 24న చేపట్టనున్నారు.
తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 
1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  
ఏపీ భూ ఉపరితలంపై నుంచి వీస్తున్న పొడి గాలుల కారణంగా అక్వాన్ తుపాను తీవ్రత కోల్పోయింది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. రేపటికి ఇది మరింత బలహీనపడి శుక్రవారం (నవంబర్ 20)  నాటికి  సాధారణ వాయుగుండంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నవంబర్ లో బంగాళాఖాతంలో తుపాను ఏర్పడిందన్న వార్త వింటే ఆంధ్రప్రజలకు దివిసీమ, కోనసీమ ఉప్పెనలే గుర్తుకు వవస్తాయి. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన, 1996 నవంబర్ 6న కోనసీమ ఉప్పెన లు రాష్ట్ర తీర ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. వందలాది ప్రాణాలను హరించాయి. ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకు పోయాయి. 
గత ఆరు గంటల వ్యవధిలో గంటకు  3 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న అక్వాన్ తుపాను,   చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నం,  విశాఖపట్నాలకు 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.  
 తుపాను తీరం దాటే సమయంలో సముద్రం  అల్లకల్లోలంగా మారుతుందనీ, అలలు సాధారణం కంటే కనీసం   రెండు మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తుపాను తీరం దాటే సమయంలో 160 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ పేర్కొంది.  
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీసీఅధికారులు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ తో పరిస్థితిని సమీక్షించారు.  తుపాను కదలికలు,  తీవ్రత,  రాష్ట్రంపై ఆ తుపాను ప్రభావం తదితర అంశాలపై ఆయన అధికారులతో చర్చించారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.