ఎవ‌రీ రాఘ‌వ్ చ‌ద్దా?.. ఏమా కథ?

Publish Date:Apr 4, 2026

Advertisement

ఎవ‌రీ రాఘ‌వ్ చ‌ద్దా? ఏంట‌త‌డి చుట్టూ అల్లుకున్న వివాదాలు?   ఆమ్ఆద్మీ పార్టీ ఎందుక‌ని అత‌డిని పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ గా తొల‌గించింది? అన్న విషయం ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన యువ‌ నాయకుడు. వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్. లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్ లో చ‌దువుకున్నారు. ఇక అతడి రాజకీయ ఎదుగుదల ఎలా సాగిందంటే..    అన్నా హ‌జారే అవినీతి వ్య‌తిరేక ఉద్య‌మ స‌మ‌యం నుంచి కేజ్రీవాల్ తో క‌ల‌సి ఉన్నారు. కేవ‌లం 33 ఏళ్ల‌కే రాజ్య‌స‌భకు ఎన్నిక‌య్యారు. పెద్ద‌ల స‌భ‌లో అతి పిన్న వ‌య‌స్కుడిగా గుర్తింపు పొందారు.

ప్ర‌స్తుతం రాఘ‌వ్ చ‌ద్దా.. వింత వింత ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తుతూ దేశ ప్ర‌జ‌ల‌ను యువ‌త‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నారు.  పది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు.  టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి?  వంటి   ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.  

అది పక్కన పెడితే.. రాఘ‌వ్ చ‌ద్దా మీద ఆరోపణలు కూడా ఉన్నాయి.  ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించి ఒక సెలెక్ట్ కమిటీని ప్రతిపాదిస్తూ, ఐదుగురు ఎంపీల సంతకాలను వారి అనుమతి లేకుండానే ఫోర్జరీ చేశారన్న తీవ్ర ఆరోపణా చద్దా ఎదుర్కొంటున్నారు. ఆ ఆరోపణ కారణంగానే రాఘవ్ చద్దా రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు.  తర్వాత సుప్రీంకోర్టు జోక్యంతో సస్పెన్షన్ ఎత్తివేశారనుకోండి అది వేరే సంగతి.

రాజ్యసభ ఎంపీగా ఆయనకు కేటాయించిన టైప్-7 బంగళా విషయంలో పెద్ద రచ్చే జరిగింది. మొదటిసారి ఎంపీ అయిన వారికి అంత పెద్ద బంగళా ఇవ్వకూడదని నోటీసులు రావడంతో ఆయన కోర్టుకు వెళ్లారు. 2024 ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు, రాఘవ్ చద్దా పార్టీకి అండగా ఉండకుండా లండన్‌లో ఉండటంపై సైతం విమర్శలు వచ్చాయి. ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగిందని పార్టీ చెప్పినా, ప్రత్యర్థులు ఆయన భయంతో పారిపోయారని ఆరోపించారు.

ఇక ఇప్పుడు తాజాగా రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించి, ఆ స్థానంలో ఇతర సీనియర్లను నియమించింది.  ఎందుకంటే.. గతంలో ఆయన సస్పెన్షన్ సమయంలో, రాజ్యసభ సెక్రటేరియట్ నియమాల ప్రకారం పదవుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. కేజ్రీవాల్ జైలుకు వెళ్ళిన సమయంలో రాఘవ్ చద్దా విదేశాల్లో ఉండటం పార్టీలోని కొందరు సీనియర్లకు నచ్చలేదని సమాచారం. ఆయన స్థానంలో జైలుకు వెళ్లి వచ్చిన సీనియర్ నేత సంజయ్ సింగ్ లేదా ఇతర నమ్మకస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ భావించింది.

రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ల నియామకంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఛైర్మన్‌కు రాసిన లేఖలో కొన్ని మార్పులు చేయాలని కోరింది. ఇది కేవలం ఒక సాంకేతిక మార్పు అని పార్టీ చెబుతున్నప్పటికీ, రాజకీయ వర్గాల్లో మాత్రం రాఘవ్ చద్దా ప్రాధాన్యత తగ్గిందనే చర్చ సాగుతోంది. ఏది ఏమైనా ఇటీవ‌ల బాగా వైర‌ల్ అయిన రాఘ‌వ్ చ‌ద్దా, ఆయ‌న ప్ర‌శ్నా ప‌రంప‌ర‌కు కాస్త బ్రేక్ ప‌డిన‌ట్టుగానే  చెప్పాలి. ఎంక‌రేజ్ చేయాల్సిన పార్టీ ఆయ‌న్ను డిస్క‌రైజ్ చేయ‌డం మీద కూడా కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.