కొడాలి నాని రూటెటు? రాజకీయమా? రాజీ ప్రయాణమా?

Publish Date:Mar 7, 2026

Advertisement

ఆ నాయకుడు చాలా కాలంగా గమ్మున వుంటూ వచ్చారు. సడెన్ గా గొంతు విప్పారు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరనుకుంటున్నారు?  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నోరెత్తకుండా కుక్కిన పేనులా మెలుగుతూ వచ్చిన ఆ నాయకుడిని ఇప్పటికే చాలా మంది  మర్చిపోయి ఉంటారు.ఇప్పుడొక్కసారిగా ఆయన గొంతు సవరించుకుని పాత బ్రాండ్ తో పాపులరవ్వాలని చూస్తుండటంతో మళ్లీ చర్చలోకి వచ్చారు. ఆయన ఎవరో కాదు.. మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని.  

ఇంత కాలం ఆయన ఎందుకు నోరెత్తకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ నోటికి పని చెప్పడానికి ఎందుకు రెడీ అవుతున్నారు?  అంటే... ఆయన ఇంతకాలం నోరెత్తకపోవడానికీ, ఇప్పుడు నోటికి పని చేప్పడానికి ప్రయత్నించడానికీ ఒకే ఒక్క కారణం. అది భయం. ఔను కొడాలి నాని ఇప్పుడు నిలువెల్లా భయంతో ఒణికి పోతున్నారు. మౌనాన్ని కొనసాగిస్తే.. రాజకీయ సమాధి, నోరెత్తితే జైళ్లు నోళ్లు తెరుస్తాయి. ఈ రెండు భయాలతో ఆయన ఏం చేయాలో, ఎలా ముందుకు సాగాలో తెలియని అయోమయావస్థలో ఉన్నారు.  

తెలుగుదేశం రాజకీయ భిక్ష పెడితే.. ఆ భిక్షతో కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలుగుదేశం ప్రాపకంతో ఒకసారి కాదు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత రంగుమార్చి వైసీపీ గూటికి చేరి మరో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ హయాంలో మంత్రిగా కూడా వెలగబెట్టారు. ఇంతటి రాజకీయ జీవితంలోనూ ఆయనకు ప్రజలలో గుర్తింపు అంటూ వచ్చింది.. ఆయన నోటిదురుసుతోనే. 

ఔను గుడివాడ నానిగా  చెప్పుకునే కొడాలి నాని తన బూతులతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబుపై, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో, అసభ్య పదజాలంతో విరుచుకుపడి వైసీపీ అధినేతకు దగ్గరవ్వడానికి చేసిన ప్రయత్నమే ఆయనను వైసీపీలో నాయకుడిగా ఎదగడానికి దోహదపడింది. అదే వాచాలత.. ప్రజలలో ఆయనపై ఏహ్యభావం కలగడానికీ కారణమైంద. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నాని నోటికి హద్దూపద్దూ లేకుండా పోయింది. 

అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరింతో అప్పటి నుంచి కొడాలినాని తన నోటికి తాళం వేసుకున్నారు. నోరు తెరిస్తే.. కేసులు తెరమీదకు వచ్చి జైలు కూడు తినాల్సి వస్తుందన్న భయంతో వణికిపోయారు. తనను అన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన గుడివాడ నియోజకవర్గాన్ని వదిలేశారు. కూటమి నేతల దృష్టిలో పడకుండా ఉంటే అదే పదివేలన్నట్లుగా ఇంత కాలం గడిపేశారు. అనారోగ్యం, చికిత్స అంటూ సానుభూతి పొందే ప్రయత్నాలూ చేశారు. 

ఏదో ఇలా మళ్లీ ఎన్నికల దాకా గడిపేద్దాం.. ఎన్నికల సమయంలో తడాఖా చూపిద్దాం అన్నట్లుగా వ్యవహరించిన ఆయనకు ఇప్పుడు అనుకోని ఉపద్రవం వచ్చింది. ఈ  సైలెన్స్ పార్టలో తన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నదన్న భయం పట్టుకుంది. పార్టీలో తనకంటే జూనియర్లు తనను దాటి  ముందుకు వెళ్లిపోతుండటంతో తత్వం బోధపడింది. అంబటి రాంబాబు ఎపిసోడ్ తో తాను రాజకీయంగా ఎంత అనామకుడిగా మిగిలిపోయాన్నది తెలిసొచ్చింది. దీంతో బెటర్ నౌ దేన్ నెవర్ అన్నట్లుగా నాని గొంతు సవరించుకున్నారు. 

అయితే ఆయనలో కేసుల భయం, రాజకీయంగా ఉనికి చాటుకోవాలన్న తాపత్రయం ఒకే సమయంలో సమానంగా ఉండటంతో ఆయన ప్రయాణం రెండు పడవల మీద ప్రయాణంలా తయారైంది.     ఓ వైపు రాజకీయ ఉనికి, మరో వైపు జైలు భయంతో నాని పరిస్థితి  ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది.  కూటమి ప్రభుత్వంపై మాటల దాడి చేస్తే  జైలు   చేయకపోతే,  రాజకీయ సమాధి.  ఏం చేయాలో? ఏం చేయకూడదో తెలియని పరిస్థితిలో నాని దిక్కుతోచని అయోమయంలో పడ్డారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. 

ఈ పరిస్థితుల్లోనే.. ఇటీవల అంబటి నివాసానికి పరామర్శకు వెళ్లిన కొడాలి నాని.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ మీద వ్యాఖ్యలు చేశారు. అయితే వాటిలో మునుపటి వాడి, వేడి లేదు. ఏం మాట్లాడితే ఎం ముంచుకొస్తుందో అన్న భయమే కనిపించింది. అయితే తన పాత దూకుడును ప్రదర్శించాలన్న ఆరాటం కూడా నానిలో కనిపించింది. చూడాలి మరి రాజకీయ భవిష్యత్ కోసం పాత తరహాలో నోరు చేసుకుంటారా? లేక కేసులు, జైలు భయంతో తన నోటిని అదుపులో ఉంచుకుంటారా?

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.