విశాఖ టీడీపీలో కొణతాల కలకలం

Publish Date:Dec 22, 2015

Advertisement



గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా వున్న విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాలు ఇప్పుడు మరోసారి రాజుకున్నాయి. నిన్నటి వరకూ పైకి ప్రశాంతంగా కనిపించిన విశాఖ టీడీపీ అంతర్గత రాజకీయాలలో ఇప్పుడు కలకలం రేగింది. ఆ కలకలం పేరు... కొణతాల రామకృష్ణ. వైసీపీకి గుడ్‌బై కొట్టిన తర్వాత కొణతాల చాలాకాలంగా ఏపార్టీలోనూ చేరలేదు. టీడీపీ నుంచి గౌరవప్రదంగా ఆహ్వానం వస్తే వాలిపోవాలని ఎదురుచూస్తు్న్నారు.  అయితే జిల్లాలో గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు వర్గాలు బలంగా వున్నాయి. ఒక వర్గం మీద మరొక వర్గం ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పొట్టేళ్ళ మధ్యకు తాను వెళ్ళడం ఎందుకులే అని కొణతాల మేకలాగా మిన్నకున్నారు. ఈ నేపథ్యంలో గంటాకు చెక్ పెట్టడం కోసం చింతకాయల అయ్యన్నపాత్రుడు చాణక్య వ్యూహం ప్రయోగించారు. కొణతాల రామకృష్ణను, ఆయన ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యే గండి బాబ్జీని తన మధ్యవర్తిత్వం ద్వారా టీడీపీలో చేర్పించినట్టయితే తన వర్గం బలం పెరిగి, గంటా శ్రీనివాసరావు వర్గం మీద పైచేయి సాధించవచ్చనేది చింతకాయల వారి వ్యూహం. దీనిలో భాగంగా ఆయనతో పాటు ఆయన మిత్రులైన ఏపీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మంగళవారం ఉదయం కొణతాల రామకృష్ణను, గండి బాబ్జీని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసానికి తీసుకుని వెళ్ళారు. గంటాకు ఎంతమాత్రం తెలియకుండా ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో వీరిద్దరూ టీడీపీలో చేరే విషయం గురించి చర్చ జరిగినట్టు సమాచారం. అన్నీ అనుకూలిస్తే త్వరలో వీరిద్దరూ టీడీపీ తీర్థం, ప్రసాదం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయ్యన్నపాత్రుడు ఈ భేటీ ఏర్పాటు చేశారన్న విషయాన్ని తెలుసుకున్న గంటా వర్గం అప్రమత్తమైపోయింది. వీరిద్దరూ కనుక టీడీపీలో చేరితో విశాఖ జిల్లాలో తమ వర్గం డౌనైపోయే డేంజరుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించడానికి గంటా వర్గం అత్యవసరంగా సమావేశమైంది. మంత్రి గంటా ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఆ వర్గానికి చెందిన జిల్లా ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, పీలా గోవింద్, పి.గణబాబు పాల్గొన్నారు. కొణతాల, గండి టీడీపీలో చేరడాన్ని తమ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసినప్పటికీ, తమకు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అయ్యన్నపాత్రుడు ఆ ఇద్దర్నీ చంద్రబాబు దగ్గరకి తీసుకెళ్ళారని, దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలని ఆ సమావేశంలో భావించినట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు సొంత వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికి తంటాలు పడుతున్నారు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం లేదు. పార్టీలో నానాటికీ పెరిగిపోతున్న ఈ ధోరణిని అరికట్టే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారో అర్థం కాని విషయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజకీయాలలో 1+1=2 ఎప్పటికీ అవ్వదనే విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి చేరికలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్ మాదిరిగా తయారైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ చేరికలను ప్రోత్సహించడం వెనుక వైసీపీని నిర్వీర్యం చేసే వ్యూహం వుందని అనుకోవచ్చు... అయితే వైసీపీ నుంచి ఎవరు వచ్చి టీడీపీలో చేరినా అప్పటికే టీడీపీలో వున్న వర్గాల్లో కలకలం రేగుతోంది తప్ప ప్రయోజనమేమీ వుండటం లేదు. దీనితోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పార్టీలో ప్రాధాన్యం పెరుగుతోందని, ఎప్పటి నుంచో పార్టీ జండా మోసిన తమకు ఎలాంటి ప్రాధాన్యం లభించడం లేదన్న అభిప్రాయం, నిర్లిప్తత పార్టీ శ్రేణుల్లో రోజు రోజుకూ పెరిగిపోతోంది. పదేళ్ళ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామన్న ఆనందం కూడా పార్టీ శ్రేణులకు మిగలని పరిస్థితులు ప్రస్తుతం పార్టీలో నెలకొన్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పార్టీ అభివృద్ధికి శ్రమించిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చే విషయాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ పరిస్థితిని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.

By
en-us Political News

  
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.