ఏపీలో స్థానిక సమరం.. వైసీపీలో అయోమయం.!

Publish Date:Aug 28, 2026

Advertisement

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి  ఆరంభమైన వేళ  వైపీపీలో గందరగోళం నెలకొంది. ఒకవైపు వైపీపీ స్థానిక పోరులో సత్తా చాటలని ఆ పార్టీ అధినేత జగన్ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చి దిశా నిర్దేశం చేసినప్పటికీ పార్టీలో ఇసుమంతైనా ఉత్సాహం కనిపించడం లేదు.  ఏకగ్రీవాలు కూడదు, అన్ని స్థానాలలోనూ గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని జగన్ విస్పష్ట ఆదేశాలు ఇచ్చినప్పటికీ స్థానిక పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై మాత్రం ఆయన ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో  క్షేత్రస్థాయి నాయకత్వం అయోమయంలో పడింది.

ముఖ్యంగా  పార్టీ అధినేత.. జగన్ వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే రాష్ట్రానికి రావడం, అదీ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం కావడం పట్ల క్షేత్ర స్థాయి క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఆదేశాలు వినా ఆయన.. స్థానిక పోరుకు సంబంధించిన ప్రణాళిక, వ్యూహాల గురించి మాట్లాడకపోవడంతో అసలేం చేయాలి? స్థినిక ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంలో పార్టీలో అయోమయ పరిస్థితులలో ఉందని పరిశీలకులు అంటున్నారు. పార్టీ శ్రేణులు కూడా జగన్ ఆదేశాల పట్ల పెదవి విరుస్తున్నారు.  వ్యూహం లేకుండా స్థానిక పోరులో సత్తా చాటండి అన్న అదేశాలు నిష్ప్రయోజనమన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. 

రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి. ఇసుమంతైనా అవకాశం, బలం లేని చోట్ల పోటీలో నిలిచి ప్రయోజనం ఏమిటన్న అభిప్రాయాన్ని వైసీపీ సీనియర్లే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 

 పార్టీ అధినేత ప్రకటిస్తున్న లక్ష్యాలు, తీసుకుంటున్న నిర్ణయాలకూ, క్షేత్రస్థాయిలో పరిస్థితులకూ అసలు పొంతనే లేదన్న అభిప్రాయమే పార్టీ వర్గాల్లో ఎక్కువగా వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో పార్టీ పరిస్థతి, క్షేత్రస్థాయిలో క్యాడర్ ఇబ్బందులు, సమస్యలు ఇవేవీ జగన్ దృష్టికి వెళ్లడంలేదని, అందుకే ఆయన నేల విడిచి సాము చేస్తున్న చందంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఆదేశాలు జారీ చేస్తున్నారని క్యాడర్, స్థానిక నాయకులు అంటున్నారు.  వీటన్నిటికీ మించి క్షేత్రస్థాయిలో  వైసీపీ సీనియర్లు, స్థానిక నేతల మధ్య  సమన్వయ లోపం, అంతర్గత విభేదాల కారణంగా పోటీలో  నిలబడినా.. అది నామమాత్రమే అవుతుందన్న ఆవేదన క్షేత్రస్థాయి క్యాడర్ లో వ్యక్తమౌతోంది.  

ఇప్పటికైనా  జగన్ తన తీరు మార్చుకుని క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు,  క్యాడర్ ఎదుర్కొంటున్న  సమస్యలపై దృష్టి సారించాలనీ, అలాగే పార్టీలో అంతర్గత విభేదాలను సర్దుబాటు చేసి, ద్వితీయ శ్రేణి నాయకులకు   భరోసా ఇవ్వకుంటే.. స్థానిక పోరులో భంగపాటు తప్పదని వైసీపీ నేతలే అంటున్నారు. 

 

 (YCP Cader Confusion, Ap  Local Body Elections, YCp Local Body Elections Strategy, YCP Leaders Unrest, Andhra Pradesh Politics, Telugu One)

By
en-us Political News

  
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.