తెలంగాణ సీఎం మార్పు?

Publish Date:Aug 22, 2026

Advertisement

తెలంగాణ అధికార కాంగ్రెస్ లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. సీనియర్ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా ఆలపిస్తున్న అసమ్మతి రాగాలూ.. సీఎం మార్పుదిశగా పడుతున్న అడుగులకు సంకేతాలంటూ రాజకీయవర్గాలలో చర్చ ఆరంభమైంది.

 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, పార్టీ సీనియర్ల పట్ల ఆయన అనుసరిస్తున్న వైఖరి పట్ల  సొంత పార్టీలో కొందరు సీనియర్లు, మంత్రులూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.   రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వర్గం ఆయనను పదవి నుంచి తప్పించేందుకు అధిష్ఠానం వద్ద తీవ్రస్థాయిలో పావులు కదుపుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సీఎంఓ నుంచి వచ్చే ఆదేశాలను  సీనియ నాయకుడు బాహాటంగానే  బహిరంగంగానే ప్రశ్నిస్తుండడం కాంగ్రెస్ శ్రేణులలో  కూడా అయోమయానికి కారణమౌతోంది.

గతంలో కూడా రేవంత్ రెడ్డి శైలిపై అసమ్మతి వ్యక్తమైనప్పటికీ, ప్రస్తుతం వ్యక్తమౌతున్నంత స్థాయిలో లేదని అంటున్నారు.  ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో సీఎం పట్ల వ్యక్తమౌతున్న అసంతృప్తి, అసమ్మతి.. అధిష్ఠానం దృష్టికి కూడా వెళ్లిందని అంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టిందంటున్నారు. 

మరో వైపుబిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తదితరులు  రేవంత్ రెడ్డి సోదరులు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారంటూ చేస్తున్న ఆరోపణలు విమర్శలూ కూడా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.   ప్రస్తుత పరిస్థితిని కర్నాటకలో మాజీ సీఎం సిద్దరామయ్యపై ఒకే సమయంలో చుట్టుముట్టిన విమర్శలు, ఆరోపణలతో తెలంగాణలో రేవంత్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలను పోలుస్తున్నారుర పరిశీలకులు.  సిద్దరామయ్యకు లాగా రేవంత్  పదవికి   ఈ ఆరోపణలు, విమర్శలుఇది ఆయన పదవికి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాయంటున్నారు. 

కాగా  పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వంటి అగ్రనేతలతో  కూడా రేవంత్ రెడ్డికి విభేదాలు పొడసూపాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మమేష్ కుమార్ గౌడ్, భట్టిలు నిరంతరం కాంగ్రెస్ హైకమాండ్ తో సంప్రదంపులు జరుపుతున్నారంటున్నారు.  ఈ నేపథ్యంలోనే పార్టీ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు అధిష్ఠానం ఏదో ఒక నిర్ణయం తీసుకునే యోచనలో ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.  మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్   రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఏ మంత సంతృప్తిగా లేదన్న ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, హైకమాండ్ రేవంత్ పట్ల ఒకింత అసంతృప్తితో ఉన్నదనడానికి సంకేతంగా చెబుతున్నారు.  ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  ఏది ఏమైనప్పటికీ..  సొంత పార్టీలోని నాయకుల అసంతృప్తి, ప్రతిపక్షాల   ఆరోపణల నడుమ తెలంగాణలో పొలిటికల్ హీట్  ఓ రేంజ్ లో పెరిగిందనడం మాత్రం వాస్తవం. 

Telangana political heat, Revanth Reddy news, Telangana Politics,Telangana Congress Dissidence, KTR Allegation,  Konda  Comments Telangana CM Change Rumors

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.