జెన్ జీ విచ్ఛిన్నానికేనా రిజర్వేషన్ హటావో ఆందోళన?

Publish Date:Aug 24, 2026

Advertisement

 

ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా రిజర్వేషన్ హటావో’ పేరుతో యువత చేపట్టిన ఆందోళన ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల నీట్ లీక్ కు వ్యతిరేకంగా జెన్ జీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన దేశవ్యాప్తంగా విద్యార్థులను, నిరుద్యోగులను,యువతను ఐక్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న రిజర్వేషన్ హఠావో ఆందోళనలు ఆ ఐక్యతను దెబ్బతీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.  సోషల్ మీడియాలో  రిజర్వేషన్ హటావో ఆందోళన్  మిలియన్ల ఫాలోవర్లతో నెట్టింట జోరుగా ప్రచారం కావడం విశేషం.  రిజర్వేషన్ వ్యవస్థపై సమగ్రమైన విశ్లేషణ చేసేందుకు ఒక జాతీయ పునఃసమీక్ష కమిషన్‌ను  ఏర్పాటు చేయాలని, గత ఎనిమిది దశాబ్దాలుగా అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రభావంపై ప్రభుత్వం వెంటనే  శ్వేతపత్రం విడుదల చేయాలని ఆందోళన కారులు కోరుతున్నారు. అలాగే కులం కంటే ఆర్థిక పరిస్థితులకే ప్రాధాన్యతనిచ్చి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు  మరింత ఊతం ఇవ్వాలని, పోటీ పరీక్షల్లో కనీస అర్హత మార్కులను సమానంగా  పాటించాలని డిమాండ్ చేస్తున్నారు.  

  1990లో  మందల్ కమిషన్ నివేదిక అమల్లోకి వచ్చిన సమయంలో దేశం ఎలాంటి  సామాజిక మార్పులకు, ఘర్షణలకు లోనైందో, మళ్లీ అలాంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు  రిజర్వేషన్ హటావో ఆందోళన (ఆర్ హెచ్ ఏ) ఆరంభమైందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  దేశంలో ఇప్పటికీ ఉన్నత విద్యాసంస్థల ఫ్యాకల్టీ పోస్టుల్లో షెడ్యూల్డ్ ఎస్సీఎస్టీ బీసీ వర్గాల ప్రాతినిధ్యం తక్కువగానే ఉందన్నది ప్రభుత్వ రికార్డుల ద్వారా తేటతెల్లం అవుతోంది.  రాజ్యాంగంలోని సమానత్వ హక్కు , ఆర్టికల్ 15,  ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన ప్రాతినిధ్యం  ద్వారా లభించిన హక్కులు కేవలం కేటాయింపులు కావు అని, అవి దశాబ్దాల తరబడి వివక్షకు గురైన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కల్పించిన రాజ్యాంగ రక్షణలు అని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వంటి నాయకులు స్పష్టం చేస్తున్నారు.

రిజర్వేషన్ హటావో ఆందోళన్ నిర్వాహకుల డిమాండ్లను   పరిగణనలోకి తీసుకుని స్వయంగా కేంద్ర మంత్రి స్థాయి అధికారి ద్వారా చర్చలు జరుపుతామని కేంద్రం హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.   ఉద్యోగాలు, విద్యావ్యవస్థలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ వివాదాన్ని రగిలిస్తున్నారా అన్న అనుమానాలు  పరిశీలకులలో బలంగా వ్యక్తమౌతున్న పరిస్థితి.

Reservation Hatao Movement at Jantarmantar, Gen Z debate India, Jantar Mantar protest, Reservation reform demand, Indian affirmative action

By
en-us Political News

  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.