‘స్థానిక ఎన్నికలు..వైసీపీ ద్వంద్వ వైఖరి.!

Publish Date:Aug 29, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైపీపీ ద్వంద్వ వైఖరీ, డోలాయమానం, అదే సమయంలో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఓ వైపు స్థానిక పోరులో గట్టి పోటీ ఇవ్వాలని పార్టీ శ్రేణులు, నేతలకు దిశా నిర్దేశం చేశారు. పనిలో పనిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ల ఆశావహులకు హెచ్చరిక కూడా జారీ చేశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే.. సదరు నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వనని హెచ్చరించాడు. 

అదే సమయంలో ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

ఒకపక్క గెలుపే లక్ష్యంగా నిలవాలంటూ అధినేత పార్టీ శ్రేణులలో జోష్ నింపడానికి ప్రయత్నిస్తుంటే..  మరోపక్క పార్టీ ఎన్నికలు నిలిపివేయాలంటూ   హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరినీ, ఎన్నికల విషయంలో ద్వేదీ భావాన్నీ, అదే సమయంలో ఓటమి భయాన్నీ సూచిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద స్థానిక ఎన్నికలను   వీలైనంత వరకు వాయిదా వేయించేందుకే సాంకేతిక అంశాలను తెరపైకి తెస్తూ కోర్టును ఆశ్రయించడం ఆ పార్టీలో స్థానిక పోరు విషయంలో ఎంత గందరగోళం నెలకొని ఉందో అర్ధమౌతున్నదంటున్నారు.

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్ కొనసాగుతోందని, ఇది పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని ఆ పిటిషన్‌లో కోరారు. పాత ఓటర్ల జాబితా ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించడం సరికాదని, కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియ పూర్తయ్యాకే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ వాదనపై న్యాయ,  ఎన్నికల విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.  ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగుతున్నంత మాత్రాన ఎన్నికలను నిలిపివేయాలనే నిబంధన ఎక్కడా లేదని, గతంలో నిర్ణయించిన అర్హత తేదీల ప్రకారం అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేస్తున్నారు.

ఇదే సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీ నాయకులతో జరిపిన సమీక్ష సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఏకగ్రీవాలు చేసుకునే అవకాశం ఇస్తే సహించేది లేదని, ప్రతి స్థానంలోనూ గట్టి పోటీ ఇవ్వాల్సిందేనని హెచ్చరించారు.

అంతేకాకుండా, స్థానిక పోరులో నిర్లక్ష్యం వహిస్తే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదని స్పష్టం చేశారు. నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ ఇలాంటి కఠిన నిర్ణయాలు ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ ఎన్నికలకు సిద్ధంగా లేదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు ఓటమి భయంతోనే న్యాయపోరాటాల పేరుతో కాలయాపన చేయాలని చూస్తున్నారనే చర్చ మొదలైంది. 

 ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు వెళితే ఆశించిన ఫలితాలు రావేమోనన్న ఆందోళన వైసీపీలో గట్టిగా వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేస్తున్న వైకాపా, ఒకవేళ స్థానిక ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో స్థానాలు గెలుచుకోలేకపోతే ఆ ప్రచారం తప్పని రుజువై ఉన్న కాస్తపరువూమంటగలుస్తుందన్న భయంలో ఉంది.  అందుకే వీలైనంత కాలం ఎన్నికల వాయిదా దిశగా వ్యూహాలు పన్నుతోందనీ, అందులో భాగంగానే ఎన్నికల నిలుపుదల కోరుతూ కోర్టును ఆశ్రయించిందని చెగుతున్నారు.  


{AP Local Body Elections, YSRCP High Court Petition, YS Jagan Mohan Reddy, Lella Appi Reddy, Voter List Special Intensive Revision, AP Politics News, Local Bodies Grant}

By
en-us Political News

  
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.