కొండా సురేఖ.. కాంగ్రెస్ తో బంధం తెంపుకున్నట్లే.!

Publish Date:Sep 3, 2026

Advertisement

మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేయడంతో తెలంగాణలో సరికొత్త సమీకరణాలు మొదలు కానున్నాయి. కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది. కేబినెట్ నుంచి బర్త్ రఫ్ తో కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిల కథ కాంగ్రెస్ లో ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక కొండా ఫ్యామిలీ కాంగ్రెస్ లో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా లేవని అంటున్నారు. 

కొండా సురేఖ.. తన వైఖరితో కాంగ్రెస్ తో బంధాన్ని తెగే వరకూ లాగారన్న మాట రాజకీయవర్గాలలో బలంగా వినిపిస్తోంది. తన వైఖరి కారణంగానే కొండా సురేఖకు హైకమాండ్ వద్ద వాదన వినిపించే చాన్స్ కూడా లేకుండా పోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు విమర్శలను ఖండించకుండా సురేఖ మొండిగా వ్యవహరించారనీ, దీంతో  ఆ క్రమశిక్షణ ఉల్లంఘనను  కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా తీసుకుందనీ అంటున్నారు. ఆ కారణంగానే హస్తిన వెళ్లిన కొండా సురేఖకు పార్టీ పెద్దల అప్పాయింట్ మెంట్ కూడా దొరకలేదని చెబుతున్నారు. 

సంక్షోభం తలెత్తిన ప్రారంభ దశలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ స్వయంగా రాఖీ కట్టారు. దీంతో వివాదానికి తెరదించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని అంతి భావించారు. కానీ.. రక్షాబంధన్ రోజున కొండా సురేఖ రేవంత్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టడం కేవలం మొక్కుబడి తంతేనన్నట్లుగా ఆ తరువాత ఆమె వైఖరి ఉంది.  ఏ దశలోనూ పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు  కొండా సురేఖ ప్రయత్నించలేదు. తాడో పేడో తేల్చుకోవడానికే సిద్ధపడినట్లుగా ఆమె ఘర్షణాత్మక వైఖరిని అవలంబించారు.  దీంతో చివరకు ఆవమానకరంగా కేబినెట్ నుంచి బర్త్ రఫ్ అయ్యే పరిస్థితి కొని తెచ్చుకున్నారు. 

అసలు కొండా దంపతుల వైఖరిలో ఎక్కడా రాజీపడే తీరు కనిపించదని వారి గతాన్ని పరిశీలిస్తే అవగతమౌతుంది.  గతంలో వైసీపీలోనూ, ఆ తర్వాత బీఆర్ఎస్‌లోనూ కొండా దంపతులు విభేదించి బయటకు వచ్చారు. ఇప్పుడు తాగాగా  కాంగ్రెస్‌ నుంచి కూడా అదే విధంగా బయటకు వచ్చే పరిస్థితిని తమంత తాముగా కొని తెచ్చుకున్నారు. 

ఇక వరంగల్ జిల్లాలో కొండా దంపతుల పట్టు కోల్పోయేలా సీఎం రేవంత్ రెడ్డి అప్పుడే పావులు కదపడం మొదలు పెట్టారని పరిశీలకులు ఉదాహరణలతో విశ్లేషిస్తున్నారు. ఆలా కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాల్సిందిగా గవర్నర్ కు సిఫారసు పంపిన రేవంత్ రెడ్డి అలా వరంగల్ జిల్లాలో  కొండాకు ప్రత్యామ్నాయంగా గుండు సుధారాణి వంటి బీసీనేతలను తెరమీదకు తీసుకువచ్చారు.  అంటే విస్పష్టంగా కాంగ్రెస్ లో వారికి ఇక స్థానం లేదని చెప్పకనే చెప్పారు. 

[Konda surekha chapter closed in Congress, Cabinet Removed, Konda Surekha, Revanth Reddy, Congress Party, Telangana Cabinet, Konda couple]

By
en-us Political News

  
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.