ప్రధాని అభ్యర్థిగా రాహుల్.. ఇండియా కూటమి పార్టీలు ఓకే.!

Publish Date:Sep 7, 2026

Advertisement

ఇండియా కూటమిలో ఐక్యత బలపడుతోంది. ఇంత వరకూ కూటమిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించే విషయంలో ఉన్న భిన్నాభిప్రాయం మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం దిశగా ఇండియా కూటమి పార్టీల అడుగులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణంగా పరిశీలకులు ఇటీవల హస్తిన వేదికగా జరిగిన జన్ జీ ఉద్యమం కారణమని అంటున్నారు.  

గత కొంతకాలంగా రాహుల్ గాంధీ చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలు, ప్రజా సమస్యలపై ఆయన చేస్తున్న పోరాటాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్నాయి.   పార్లమెంట్ వేదికగా అధికార పార్టీ విధానాలను ఎండగట్టడంలో ఆయన చురుకుగా, చొరవగా వ్యవహరిస్తున్న తీరుతో ఇండియా కూటమి పార్టీలు ఆయన నాయకత్వం పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నాయి. అలాగే  యువతను ఆకట్టుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇండియా కూటమి పార్టీలలో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ వైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతున్నాయని అంటున్నారు.   ఈ నేపథ్యంలో తాజాగా సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.బేబీ  ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని ప్రకటించారు.   ప్రతిపక్ష నాయకుడిగా ఆయనే కూటమి ప్రధాని అభ్యర్థి అని పేర్కొన్నారు.  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఇండియా కూటమి మెజారిటీ సాధిస్తే సహజంగానే రాహుల్ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని అన్నారు.  ఇప్పటికే టీవీకే అధినేత టీవీకే విజయ్ తాను ప్రధాని రేసులో లేననీ, కూటమి భాగస్వామ్య పార్టీగా తన మద్దతు రాహుల్ గాంధీ అభ్యర్థిత్వానికేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.  

 ఇండియా కూటమిలో  ప్రధాని అభ్యర్థి విషయంలో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉన్నాయన్న ప్రచారం నేపథ్యంలో సీపీఎం ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.  ఏది ఏమైనప్పటికీ వచ్చే సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ఈ విషయంలో క్లారిటీ వస్తుందంటున్న పరిశీలకులు, రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల ఇండియా కూటమి పార్టీలు ఒకదాని తరువాత ఒకటిగా న్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులను బట్టి  నిర్ణయం తీసుకుంటాయయంటున్నారు.  

ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ఐండియా కూటమి పార్టీల అడుగులు పడుతున్నాయి.  ఐక్యంగా ఉంటేనే బలమైన ప్రత్యామ్నాయంగా జనం భావిస్తారనీ, గుర్తిస్తారనీ  కూటమి పార్టీలు భావిస్తున్నాయి. భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ప్రజల ముందు ఒక బలమైన ప్రత్యామ్నాయాన్ని ఉంచాలని ప్రయత్నిస్తున్నాయి. అందెలొ భాగంగారు నే నాయకత్వ అంశంపై ఒక స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయంటున్నారు పరిశీలకులు.

[INDIA Allience Unity, Rahul Gandhi PM Post, MA Baby CPIM, Opposition Alliance India, Lok Sabha Elections, Congress Party Leadership, Telugu One] 

By
en-us Political News

  
ఎన్నికల సంఘం వ్యవహారాల్లో పారదర్శకత, స్వతంత్రత కోసం చట్ట సవరణ అవసరమంటూ సామాజిక మాధ్యమ వేదికగా ఆయన షేర్ చేసిన ట్వీట్  పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పార్లమెంటులో మద్దతు ఇస్తూ.. బయట మాత్రం  వ్యతిరేకిస్తున్నట్లు కనిపించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం ఈ ట్వీట్ కళ్లకు కట్టింది.  
2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీ  రాష్ట్రంలో   రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి శతధా  ప్రయత్నిస్తోంది.  ఈ తరుణంలో ప్రజా సమస్యల ప్రాతిపదికన జరిగే  వామపక్షాలు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొనడం ఆ పార్టీకి రాజకీయంగా ఒకింత సానుకూలత వస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   
కేంద్ర పెద్దల కరుణా కటాక్షాల కోసం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. గత నెలలో హస్తిన వెళ్లి పెద్దలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అది ఫలించ లేదు. కేంద్ర పెద్దల అప్పాయింట్ మెంట్ దొరకకపోవడంతో జగన్ హస్తిన పర్యటనకు వెళ్లలేదు.
ఇటీవలి కాలంలో మీడియాకు ముఖం చాటేయడమే కాకుండా, పార్టీ వ్యవహారాల్లో కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న సజ్జల తీరును వారు ఉదహరిస్తున్నారు.   ఇటీవలి కాలంలో సజ్జల సైలెన్స్ పార్టీ వర్గాలను సైతం విస్మయ పరుస్తున్నది.
స్థానిక సమరంలో సత్తా చాటాలంటే ఇవేమీ పెద్దగా పని చేయవని భావిస్తున్న జగన్ తన ఆశలన్నీ తెలుగుదేశం కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేనపై ఆశలు పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా  జనసేన అధినేత, జనసైనికులను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నారు.
తమ నియామకాలకు సంబంధించి   చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఉన్నాయనీ,  క్రీడా కోటా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న జగన్‌ మోహన్ రెడ్డి, వైసీపీ నేతల ఆరోపణలను సక్ష్యాలతో సహా తిప్పి కొట్టారు.  ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి క్రీడా కోటాలో ఉద్యోగాలు రావడానికి వీలేదంటూ వైసీపీ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు.. ఆ పార్టీ నేతల అజ్ఝానానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.
సరిగ్గా స్థానిక సన్నద్ధత కీలకంగా మారుతున్న సమయంలోనే జగన్ సకుటుంబంగా యూరొప్  వెళ్లనుండటం కూడా ఆ పార్టీకి ప్రతికూలంగానే పరిణమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ.. ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.   తెలంగాణలో దశాబ్దం పాటు అధికారంలో ఉన్న   బీఆర్ఎస్  2023 ఎన్నికలలో ప్రజాతీర్పు కారణంగా ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యింది. ఇక ఏపీలో 2024 ఎన్నికలలో ఘోర పరాజయాన్నిఎదుర్కొన్న వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలింది.
ఉత్తరాంధ్ర రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ముఖ్యనేతల మధ్య వ్యక్తమవుతున్న అసంతృప్తులు జగన్ లో ఆ ప్రాంతంలో పార్టీ ఉనికి మాత్రంగా కూడా మిగలదా అన్న భయాన్ని రాజేశాయంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా స్థానిక ఎన్నికల ముంగిట పార్టీ నుంచి వరుస వరసలు జగన్ ను కలవర పెడుతున్నాయి.  
బొత్స ఆశీస్సులతో విజయనగరం జిల్లాలో క్షేత్రస్థాయి రాజకీయ వ్యవహారాలను, పార్టీ వ్యవహారాలనూ చిన్న శ్రీను అదేనండి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావే చూసుకుంటున్నారు.
ఉండవల్లి వైఎస్ భక్తుడు. ఆ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆ భక్తితోనే  అవసరం ఉన్నా లేకున్నా జగన్ కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అవసరమైన మాట సాయం చేయడానికి ఉండవల్లి ఎప్పుడూ ముందుంటారు. జగన్ కు మేలు చేసేలా అడిగినా, అడగకున్నా ఉచిత సలహాలు పారేస్తుంటారు. ఇదంతా ఎందుకు నేరుగా వైసీపీలో చేరి ఆ పని చేయొచ్చుకదా అంటే, ఆ పని మాత్రం చేయరు ఉండవల్లి.  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.