సజ్జల నన్ను కొట్టాడు.. విజయసాయి నెక్స్ట్ టార్గెట్ జగనేనా?
Publish Date:Aug 29, 2026
Advertisement
విజయసాయి రెడ్డి ఒకప్పుడు జగన్‌కు కుడిచేయిలా ఉండేవారు. అంతే కాదు వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగారు. పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు.అంతేనా ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆయన వైసీపీలో లేరు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. వ్యవసాయమే వ్యాపకమన్నారు. అయితే ఆ మాటకు కట్టుబడి ఉండలేదు. తాజాగా సొంత పార్టీ ప్రకటించారు. శ్రావణమాసం మూడో శుక్రవారం పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తానన్నారు. ఈ లోగానే వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత కోటరీపైనా సంచలన విమర్శలతో ఓ బహిరంగ లేఖ రాశారు. జగన్ అనుచర వర్గాన్ని నేరుగా లక్ష్యంగా చేసుకుని సాయి రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తన లేఖలో విజయసాయి.. సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు గుప్పించారు.పనిలో పనిగా జగన్ పట్టించుకోలేదంటూ నిష్టూరమాడాడు. గతంలో కూడా పలు సందర్భాలలో వైసీపీలో జగన్ కోటరీపై విమర్శల దాడులు చేసిన విజయసాయి రెడ్డి తన తాజా బహిరంగ లేఖలో మాత్రం సజ్జల టార్గెట్ గా నేరుగానే విమర్శల దాడి చేశారు. ఆరోపణలు గుప్పించారు. ఇంత జరుగుతున్నా జగన్ మౌనంగా ఉండడాన్ని నిలదీశారు. అలాగే జగన్ పట్ల తాను ఎంత లాయల్ గా ఉన్నానో చెప్పుకొచ్చారు. తానెన్నడూ జగన్ కు ద్రోహం చేయలేదన్న విజయసాయి.. జగన్ కోసం తాను ఎంతో చేశానని చెప్పుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ఏ1 అయితే తాను ఏ2 అని గుర్తు చేశారు. అంతే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం, కాకినాడ పోర్ట్ కేసుల్లో కూడా తన పేరు ఉందనీ, వీటి వేటిలోనూ సజ్జల పేరు ఎందుకు లేదని ప్రశ్నలు గుప్పించారు. అక్కిడితో ఆగకుండా.. సజ్జలకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో, తెలుగుదేశంతో కు రహస్య అవగాహన ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. వైసీపీని వీడిన తరువాత నుంచీ సాయిరెడ్డి.వరుసగా ప్రణాళికా బద్ధంగా ఆ పార్టీపై విమర్శలు ఆరోపణలూ చేస్తున్న క్రమం గమనిస్తే.. ఆయన నెమ్మది నెమ్మదిగా జగన్ ను టార్గెట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయసాయి తన ఆరోపణలన్నీ ఒకే సారి గుప్పించలేదు. తొలుత జగన్ కోటరీ అంటూ ఎవరి పేరూ ప్రస్తావించకుండా సాఫ్ట్ గా విమర్శించారు. ఆ తరువాత జగన్ కోటరీ ఆయనను తప్పుదోవపట్టిస్తోందనీ, జగన్ గమనించాలనీ సూచించారు. ఆ తరువాత కొందరి పేర్లు ప్రస్తావిస్తూ ఆరోపణలూ, విమర్శలూ చేశారు. మద్యం కుంభకోణం కేసులో కర్త, కర్మ, క్రియా అన్నీ రాజ్ కేసిరెడ్డే అని తొలుత చెప్పినది విజయసాయిరెడ్డే అన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇటీవల జగన్ హయాంలోనే రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు భారీగా జరిగాయని బాంబు పేల్చారు. ఇప్పుడు తాజాగా నేరుగా సజ్జలపై విమర్శలూ, ఆరోపణలూ గుప్పించారు. 2022లో జరిగిన వైసీపీ ప్లీనరీలో సజ్జల తనపై భౌతిక దాడికి పాల్పడ్డారన్న విజయసాయి, అప్పుడు జగన్ ప్రేక్షక పాత్ర వహించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే.. ఇప్పటి దాకా జగన్ ను నేరుగా విమర్శించలేదు. తాజా బహిరంగ లేఖలో మాత్రం జగన్ మౌనాన్ని నిలదీశారు. ప్రశ్నించారు. తద్వారా తన ఆరోపణలపై జగన్ స్పందించాలన్న డిమాండ్ ను తెరపైకి తీసుకు వచ్చారు. దీనిని బట్టి చూస్తుంటే.. తన కొత్త పార్టీ ప్రారంభించిన తరువాత ఇక ఆయన నేరుగా జగన్ నే టార్గెట్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక . స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి. {Vijayasai Reddy Next Target Jagan,Vijaya Sai Open Letter, Sajjala, Attack Ycp Internal Crisis, AP Politics, Telugu One}
అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ నాయకుడు అంటూ పేరు చెప్పకుండా ఆరోపణలు, విమర్శలూ గుప్పించారు. ఆ నాయకుడే జగన్ మనసులో తనకు వ్యతిరేకంగా విషం నింపారనీ, ఇప్పుడా నాయకుడు నాయకుడు తెలుగుదేశం గూటికి చేరేందుకు రెడీ అయ్యారన్నారు.
http://www.teluguone.com/news/content/vijayasai-reddy-next-target-jagan-45-230229.html





