ఉండవల్లి ఉపమానాలు.. శ్రీవారి భక్తుల్లో ఆగ్రహావేశాలు

Publish Date:Feb 10, 2026

Advertisement

ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవెల్లిలా రంగులు మారుస్తుంటారన్న విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఆయన తన వాక్చాతుర్యంతో  తిమ్మిని బమ్మిని చేస్తారు. ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంలో కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.  

మ‌నం తాగే టీ క‌ప్పు, బాత్రూం క‌మోడ్ రెండూ ఒక‌టే పింగాణీ మెటీరియ‌ల్ తో త‌యారు చేస్తారన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. అంత‌మాత్రం చేత  రెండూ  ఒక‌టై పోవు. అస‌లా  పోలిక ఎలా తెస్తారు?  ఆ సిరామిక్ క‌ప్పుల్లో టీ తాగే వారికి  ఎలా  ఉంటుందీ?  అంటూ లాజిక్ లేవదీశారాయన, అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో  బాత్రూంలో వాడే యాసిడ్స్ వంటి ప‌దార్ధం క‌లిపార‌ని అనడానికి ఆయనీ విధంగా కౌంటరిచ్చారన్న మాట. దీనిపైనే నెటిజనులు ఉండవల్లిపై ఫైర్ అవుతున్నారు. 

ఇంతకీ జగన్  హయాంలో లడ్డూ తయారీ ప్రసాదంలో కలిపిన ఆ  ర‌సాయ‌నాన్ని  ద‌క్షిణ కొరియా నుంచి దిగుమ‌తి చేసుకున్నారు. కొరియాకు చెందిన ఐఎల్ షిన్ వెల్స్ అనే  ఒక  కంపెనీ త‌యారు చేసే మోనో గ్లిజ‌రైడ్స్ అనే ర‌సాయ‌నాన్ని ఈ క‌ల్తీ నెయ్యిలో వాడిన‌ట్టుగా  సిట్ ద‌ర్యాప్తులో తేలింది. అస‌లిది  నెయ్యే కాదు. కేవ‌లం ల్యాబ్ ప‌రీక్ష‌ల్లో మాత్ర‌మే నెయ్యిలా క‌నిపించే ఒకానొక కృత్రిమ మిశ్ర‌మం. ఈ ర‌సాయ‌నాన్ని  వంట నూనెల  పేరిట న‌కిలీ బిల్లులు సృష్టించి.. మ‌రీ దిగుమ‌తి చేసుకున్నార‌ని గుర్తించారు.

ఈ లెక్క‌న చూస్తే శ్రీవారి భ‌క్తుల‌ను,  హిందువుల‌ను మోసం చేయ‌డానికి ఎంత‌టి  కుట్ర జ‌రిగిందో  అవగతమౌతుంది. ఒక ఇన్వెస్టిగేటివ్ అడ్వ‌కేట్ గా ఉండ‌వ‌ల్లి బ‌య‌ట పెట్టాల్సిన విష‌యాలు ఇవీ. అది పక్కన పెట్టి టీకప్పు, కమోడ్ పింగాణీ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు.  అసలింతకీ దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుని మరీ లడ్డూ ప్రసాదంలో కలిపిన ఈ రసాయనం ఎలా తయారౌతుందని చూస్తూ.. ఈ ర‌సాయ‌నం త‌యార‌య్యేదే జంతు కొవ్వు నుంచి. గ‌తంలో ఎన్డీడీబీ రిపోర్టులో పంది కొవ్వు, జంతు కొవ్వు ఉన్నాయ‌ని  నివేదిక రావ‌డానికి కార‌ణం ఇదే. పామాయిల్ లో బీటా కెరోటిన్ అనే ఎసిటిక్ యాసిడ్ వంటి కెమిక‌ల్స్ క‌లిపి.. దానికి ఈ కొరియ‌న్ ర‌సాయ‌నాన‌న్ని యాడ్ చేస్తే అది  అచ్చం నెయ్యి రంగు, వాస‌న‌, చిక్క‌ద‌నాల‌ను సంత‌రించుకుంటుంది.

 అంటే ఒక కొత్త నెయ్యి ప‌దార్ధాన్ని క‌నిపెట్టార‌న్న‌మాట‌.  చుక్క నెయ్యి వాడ‌కుండా నెయ్యి త‌యారు చేయ‌డం ఎలా? అన్న ప‌రిశోధ‌న‌లు చేయ‌డం మాత్ర‌మే కాకుండా  ఆ పదార్థంతో లడ్డూ ప్రసాదం తయారు చేసి శ్రీవారి భక్తులకూ, శ్రీవారికీ కూడా పంగనామాలు పెట్టేశారు. ఇవేమీ చెప్పకుండా ఉండవల్లి ఉపమానాలతో ఉపమేయాలతో తిమ్మిని బమ్మిని చేయడానికి చేసిన ప్రయత్నంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. శ్రీవారి భ‌క్తుల్లో ఆగ్ర‌హావేశాలు వ్యక్తమౌతున్నాయి.

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.